Big Stories

Kesar Drink for Glowing Skin: పరగడుపున ఈ డ్రింక్ తాగితే చాలు అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్!

 

- Advertisement -
Healthy Drinks
Healthy Drinks

Kesar Drink for Skin in the Early Morning: ప్రతి రోజు ఉదయాన్నే చాలా మంది టీ, కాఫీలు తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇక కొంత మంది హెల్తీగా ఉండేందుకు గ్రీన్ టీ, నిమ్మకాయ నీళ్లు తాగుతుంటారు. అయితే ఉదయం పూట తీసుకునే ఏ డ్రింక్ అయినా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడాలి. అందువల్ల టీ, కాఫీలకు బదులు రోజంతా శరీరాన్ని యాక్టివ్ గా, ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్ తీసుకోవడం మంచిది. ఉదయాన్నే పరిగడుపున వేడివేడి టీ, కాఫీలు తాగడం వల్ల కడుపులో సమస్యలు ఎదురవుతాయి. వేడిగా ఉండే పదార్థాల కన్నా ఉదయాన్నే గోరు వెచ్చగా, లేక నార్మల్ కూల్ ఉండే డ్రింక్స్ ను తయారుచేసి తీసుకోవాలి. అయితే ఇందులో చాలా మందికి తెలియని ఓ స్పెషల్ డ్రింక్ ఉంది. చాలా మంది భారతీయులు వంటకాల్లో వాడే దీనిని డ్రింక్ లా చేసుకుని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

- Advertisement -

కొన్ని డ్రింక్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మ కాంతిని కూడా పెంచుతాయి. అటువంటి డ్రింక్స్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ డ్రింక్స్ లో ముఖ్యంగా కుంకుమ పువ్వుతో చేసిన నీటిని తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి, చర్మానికి అనేక లాభాలు ఉన్నాయి. ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని కుంకుమ పువ్వు నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా కుంకుమపువ్వును స్వీట్లు తయారు చేయడంలో, బిర్యానీకి కలర్ కోసం వంటి రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. అంతేకాదు, ప్రెగ్నెన్సీ సమయాల్లో కుంకుమపువ్వును తీసుకోవడం వల్ల పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని, ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అయితే ఇది కేవలం ప్రెగ్నేన్సీ సమయంలోనే కాకుండా.. తరచూ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా, అందంగా ఉండొచ్చు.

Also Read: ఎండలో తిరిగి ముఖానికి టాన్ పట్టేసిందా?.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

కుంకుమపువ్వులో ఉండే ఫైబర్, కాల్షియం చర్మం కాంతివంతంగా కనిపించేందుకు పనిచేస్తాయి. ప్రతీ రోజు ఉదయం కుంకుమపువ్వు నీటిని తాగడం వల్ల బహిష్టుకు సంబంధించిన నొప్పిని నివారించవచ్చు. అంతేకాదు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని కూడా కుంకుమపువ్వు నీటితో నిరోధించవచ్చు. శరీర ఆరోగ్యానికి తోడ్పడే కుంకుమపువ్వు నీటిని తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం.

కేసర్ వాటర్ తయారీ విధానం

5 నుంచి 7 కుంకుమపువ్వులను తీసుకోవాలి. వీటిని గోరు వెచ్చని నీటిలో వేసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా తయారుచేసుకున్న నీటిని.. గోరువెచ్చగా ఉండగానే తాగాలి. రోజు ఉదయం పరిగడుపున ఈ నీటిని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News