Big Stories

Face Mask for Sun Tan: ఎండలో తిరిగి ముఖానికి టాన్ పట్టేసిందా..? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి!

 

- Advertisement -
Face Mask For Sun Tan
Face Mask For Sun Tan

Natural Face Mask for Sun Tan in Summer: ఎండాకాలం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు ఎదురవుతుంటాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎండలో తిరగడం మూలంగా బాడీలో వాటర్ కంటెంట్ చెమట రూపంలో బయటకు వెళిపోతుంది. దీని కారణంగా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. మరోవైపు ఎండలో తిరగడం వల్ల ముఖానికి ట్యాన్ పేరుకుపోయి.. నల్లగా మారిపోతుంది. దీంతో ఎండాకాలం అంతా ఈ సమస్యలతో బాధపడుతుంటారు. అయితే టాన్‌ను రిమూవ్ చేసుకునేందుకు చాలా రకాల ఫేస్ ప్యాక్‌లు మార్కెట్లో దొరుకుతుంటాయి. కానీ ఆ క్రీముల్లో ఉండే రసాయనాల మూలంగా అప్పటి వరకు ముఖం తెల్లగా మారిక భవిష్యత్తులో మాత్రం త్వరగా ముడతలు రావడం, ముసలి ముఖం రావడం త్వరగా జరుగుతుంది. అందువల్ల మార్కెట్లో దొరికే క్రీముల కంటే టాన్ రిమూవ్ చేసుకునేందుకు వంటింట్లో సహజంగా దొరికే వాటితో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.

- Advertisement -

1. పెరుగు ఫేస్ ప్యాక్..

ఎండలో తిరగడం మూలంగా ముఖంపై పేరుకుపోయిన ట్యాన్‌ను తొలగించేందుకు పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, తేమగా మారుస్తుంది. అంతేకాదు ఫేస్ గ్లోను కూడా పెంచుతుంది. ఈ క్రమంలో ఎండాకాలంలో పేరుకుపోయే సన్ ట్యాన్ ను తొలగించుకునేందుకు పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ కోసం పసుపు, పెరుగు వాడాల్సి ఉంటుంది. ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టీ స్పూన్ పసుపును తీసుకుని బాగా కలుపుని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకుని అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

Also Read: స్పైసీ ఫుడ్‌తో వ్యాధులకు చెక్.. ఇది పెయిన్ కిల్లర్ అని మీకు తెలుసా..?

2. యాపిల్ పేస్టు..

యాపిల్ పేస్టుతోను టాన్ ను తొలగించుకోవచ్చు. యాపిల్ గుజ్జును పేస్ట్ లా చేసుకుని అందులో టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ బార్లీ పిండిని కలిపి మెత్తగా పేస్ట్ లా మార్చుకోవాలి. అనంతరం ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని అరగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా కనిపిస్తుంది.

3. శనగపిండి ప్యాక్..

సన్ టాన్ తొలగించేందుకు శనగపిండి కూడా చక్కగా పని చేస్తుంది. ఒక గిన్నెలో సగం టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ శనగపిండిని వేసుకుని ఫేస్ ప్యాక్ లా తయారుచేసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు ఉంచుకుని చల్లటి నీటితో కడుక్కోవాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News