Big Stories

Eggs: చిన్న పిల్లలకు గుడ్డు ఎప్పటి నుంచి తినిపించాలో తెలుసా?

 

- Advertisement -

Eggs: చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి ఐదేళ్ల వయసు వచ్చే వరకు ఇచ్చే ఆహారం చాలా ముఖ్యమైనది. పిల్లల పెరుగుదలకు ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల తరచూ వారికి మంచి పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే ఆహారం గురించి చాలా మంది తల్లులకు అవగాహన ఉండదు. అయితే తరచూ ఇచ్చే ఆహారంలో కోడిగుడ్డు అనేది మంచి ప్రోటిన్ ఫుడ్ అని చెప్పవచ్చు. అయితే కోడిగుడ్డును అసలు ఏ వయసు పిల్లలకు తినిపిస్తారు అనేది చాలా మందికి తెలిసి ఉండదు. దీనిపై చాలా సందేహాలు ఉంటాయి. ఏ వయసు నుంచి గుడ్లు తినిపించాలి. ఎన్ని తినిపించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

పిల్లలకు పుట్టిన తర్వాత ఆరునెలల నుంచి గుడ్డు తినడం ప్రారంభించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డులో ఖనిజాలు, ప్రోటిన్లు అధికంగా ఉంటాయి. వీటిని పిల్లలకు ఆరు నెలల వయసు నుంచి తనిపించడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే బిడ్డకు ఎన్ని గుడ్లు తినిపించాలి అనే సందేహం కూడా ఉంటుంది. అయితే మొదట్లో సగం గుడ్డును మాత్రమే తినిపించాలి. అలా అలవాటు చేసాక.. నెమ్మదిగా అన్ని ఆహారాలు తినింపించడం మొదలుపెట్టాలి.

ఏడాది వయస్సు వచ్చే వరకు ప్రతి రోజూ చిన్న పిల్లలకు గుడ్డును తినిపించొచ్చు. బిడ్డ ఎదుగుదలకు గుడ్డు అద్భుతంగా సహకరిస్తుంది. పిల్లల కండరాలను బలపరచేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు గుడ్డులో ఉండే విటమిన్ ఇ, డీ, ఎలు కూడా పిల్లల ఎములకలను బలంగా చేస్తాయి. అయితే మొదటి సారి బిడ్డకు గుడ్డును తినింపిచే సమయంలో అందులోని పసుపు భాగాన్ని తినిపించాలట. ఆ తర్వాత గుడ్డును తినిపించడం స్టార్ట్ చేయాలి. గుడ్డు తినిపించే క్రమంలో అవి తాజాగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News