BigTV English

Father Brutally Killed Son: ఆరేళ్ల కొడుకుపై కర్కశంగా ప్రవర్తించిన తండ్రి.. చివరికి..!

Father Brutally Killed Son: ఆరేళ్ల కొడుకుపై కర్కశంగా ప్రవర్తించిన తండ్రి.. చివరికి..!

Father Brutally Killed His Son: ఉన్మాదుల్లా ప్రవర్తించే మనుషులు అక్కడక్కడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కరి ప్రవర్తనా విధానం ఒక్కోలా ఉంటుంది. కానీ కొందరి పిచ్చి, పీక్స్ కు చేరినప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇలానే అమెరికాలో ఓ వ్యక్తి ప్రవర్తించాడు. కన్న కొడుకు లావుగా ఉన్నాడని థ్రెడ్ మిల్ పై నడిపించాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా బయటకు రావడంతో ఈ విషయం సంచలనంగా మారింది.


అమెరికాలో క్రిస్టోఫర్ అనే వ్యక్తి సొంత కొడుకునే టార్చర్ చేశాడు. బాలుడు కోరె ఒంట్లో కొవ్వు ఉందని గంటల తరబడి థ్రెడ్ మిల్ పై నడిపించాడు తండ్రి. థ్రెడ్ మిల్ పై పరుగులు పెట్టలేక చిన్నారి ఎంతో ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ చలించని తండ్రి మరింత సేపు నడవాలంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా కోరె తలపై కొరికి మరీ.. థ్రెడ్ మిల్ మీద పరుగులు తీయించాడు. 2021 జూలై నెలలో ఈ ఘటన జరిగింది.

థ్రెడ్ మిల్ పై నడుస్తున్న సమయంలో బాలుడు అలసిపోయి క్రింద పడిపోయాడు. అయితే గాయపడిన కోర్ ను న్యూజెర్సీలోని చైల్డ్ ప్రొటెక్షన్ వద్దకు తీసుకువెళ్లారు. అప్పుడు బాలుడు అధికారులకు తన తండ్రి హింసించిన విధానం గురించి  వివరించాడు. అనంతరం పిల్లాడిని ఆసుపత్రికి తరలించగా.. గుండె, లివర్ ఫేల్ అయ్యాయని డాక్టర్లు తెలిపారు.


Also Read: ఇదేందయ్యా ఇది నేనేడా చూడలే.. పాత కూలర్ తో..

చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అందులో భాగంగానే సీసీ ఫుటేజ్ పోలీసుల కంట పడింది. నేరం రుజువైతే క్రిస్టోఫర్ కు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

Tags

Related News

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Big Stories

×