E-Paper
Advertisement

CM Jagan: పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ హాట్ కామెంట్స్..

CM Jagan: పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ హాట్ కామెంట్స్..
Advertisement

YS Jagan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు ఏం చేప్తే దానికి జిందాబాద్ కొట్టేలా దత్తపుత్రుడి పరిస్థితి తయారైందని విమర్శించారు. పవన్ ఓ ప్యాకేజి స్టార్ అంటూ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

టీడీపీ, జనసేన పొత్తుపై సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదని విమర్శించారు. చంద్రబాబు తన మనుషులను పంపితేనే ఆ కూటమి ఏర్పడిందని.. పవన్ ఎప్పటికీ చంద్రబాబు మనిషి అని ఆరోపించారు. కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కూటమి, పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

దత్తపుత్రుడికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడ ఎవరు పోటీ చేయాలి.. చివరికి ప్యాకేజీస్టార్ కూడా ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబు నిర్ణయించారని జగన్ ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిని కూటమి ఇది కాదన్నారు. చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్, ఏం చేయమంటే అది ప్యాకేజీస్టార్ చేస్తాడని విమర్శించారు.

ప్యాకేజీస్టార్ కు ఇంతకుముందు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి.. ఇప్పుడు పిఠాపురం నాలుగోది అంటూ ఆయన పెళ్లిళ్లను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. మ్యారేజి స్టార్ కు ఏ భార్య పైనా ప్రేమ ఉండదు.. ఏ ప్రాంతంపైనా ప్రేమ ఉండదన్నారు. ప్యాకేజీస్టార్ కు పెళ్లిళ్లే కాదు.. నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయని అన్నారు.

Advertisement

Also Read: ఏపీ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు ఇవే.. చంద్రబాబు

వైసీపీకి ఓటు వేస్తే ఇంటికే రూ.3వేలు వస్తాయన్నారు. పథకాలు అమలు కావాలంటే తప్పుకుండా వైసీపీ అధికారంలోకి వచ్చి తీరాలన్నారు.పొరపాటున్న చంద్రబాబుకు ఓటు వేస్తే.. చంద్రముఖి నిద్రలేస్తుందని ఎద్దేవా చేశారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×