BigTV English
Advertisement

Oats Pakodi: నోరూరించే ఓట్స్ పకోడీ.. దీన్ని చేయడం చాలా ఈజీ

Oats Pakodi: నోరూరించే ఓట్స్ పకోడీ.. దీన్ని చేయడం చాలా ఈజీ

ఓట్స్ అనేవి ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలో ఉంటాయి. చప్పగా ఉండే ఓట్స్ ను ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా నేటి యువత ఓట్స్ జోలికి వెళ్లరు. అయితే వీటితో క్రిస్పీగా, క్రంచీగా పకోడీలు కూడా చేసుకోవచ్చు. మిగతా పకోడీలతో పోలిస్తే ఓట్స్ పకోడీలు టేస్టీగా ఉంటాయి. పైగా త్వరగా వేగిపోతాయి.ఇక్కడ మేము ఓట్స్ పకోడీ రెసిపీ ఎలాగో ఇచ్చాము. మేము చెప్పినట్టు చేస్తే టేస్టీ ఓట్స్ పకోడీ సిద్ధమైపోతుంది.


ఓట్స్ పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు
ఓట్స్ – ఒక కప్పు
జీడిపప్పులు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
గరం మసాలా – అర స్పూన్
పసుపు – పావు స్పూను
కారం – ఒక స్పూను
పచ్చిమిర్చి – ఒకటి
శనగ పిండి – పావు కప్పు
అల్లం వెల్లుల్లి – ఒక స్పూను
ఉల్లిపాయలు – రెండు
బియ్యప్పిండి – పావు కప్పు

ఓట్స్ పకోడీ రెసిపీ
1. ఒక గిన్నెలో ఓట్స్ వేసి నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి.
2. ఓట్స్ మొత్తం నిండిపోయేలా కాకుండా సగం మాత్రమే నీళ్లు పోయాలి. ఓట్స్ మెత్తగా అయ్యేలా చూసుకోవాలి.
3. ఓట్స్ మెత్తగా అయ్యాక ఆ గిన్నెలోనే బియ్యప్పిండి, శెనగపిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
4. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేసి కలపాలి.
5. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
6. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టును, గరం మసాలా పొడిని, కారం, పసుపు, కరివేపాకుల తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.
7. మీకు పకోడీ మెత్తగా కావాలనుకుంటే నీటిని కలుపుకొని కాస్త జారే లాగా పకోడీని వేసుకోవాలి.
8. లేదా గట్టిగా కావాలి అనుకుంటే చపాతీ పిండికి ఎంత గట్టిగా కలుపుకుంటారో అలా దీన్ని కలుపుకోవాలి.
9. జీడిపప్పులను చిన్న ముక్కలుగా చేసి ఈ పకోడీ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి.
10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
11. నూనె బాగా వేడెక్కాక ఈ ఓట్స్ మిశ్రమాన్ని పకోడీల్లా వేసి అన్ని వైపులా వేగించుకోవాలి.
12. వీటిని తీసి టిష్యూ పేపర్ పై వేసుకోవాలి. అదరపు నూనెను టిష్యూ పేపర్ పీల్చేస్తుంది.
13. ఇప్పుడు టేస్టీ ఓట్స్ పకోడీ రెడీ అయినట్టే. దీన్ని ఒకసారి తిని చూడండి. మీకు ఇతర పకోడీలు కన్నా ఈ పకోడీ కచ్చితంగా నచ్చుతుంది.


Also Read: కేరళ స్టైల్లో కొబ్బరి పచ్చడి ఇలా చేశారంటే అన్నం ఇడ్లీ, దోశ అన్నిట్లోకి ఉపయోగపడుతుంది

ఇతర పకోడీలతో పోలిస్తే ఇందులో ఓట్స్ వేసాము కాబట్టి మరిన్ని పోషకాలు లభిస్తాయి. శెనగపిండి, బియ్యప్పిండి, ఓట్స్ ఈ మూడు పకోడీలకు మంచి రుచిని అందిస్తాయి. క్రంచీగా, క్రిస్పీగా వచ్చేలా చేస్తాయి.

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×