Uber-Ola : ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (IOS) డివైజ్‌లతో బుకింగ్ చేసేటప్పుడు ఒకే విధమైన రైడ్‌ల కోసం వినియోగదారులు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఈ పోస్ట్ పై స్పందించిన పోస్ట్ ఓలా (Ola), ఉబర్ (Uber) ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ తెలుపుతూ నోటీసులు జారీ చేసింది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్‌లకు నోటీసులు జారీ చేసింది. రైడ్‌లను బుక్ చేయడానికి ఉపయోగించే మొబైల్ మోడల్ బట్టి ధరలు ఉన్నాయని యూజర్స్ ఆరోపించిన ఘటనపై వివరణ ఇవ్వాలని కోరింది.
CCPA తన నోటీసులో కంపెనీలు తమ ధరల విధానాన్ని వివరించాలని, కస్టమర్స్ చెబుతున్న విషయాలపై వివరణ ఇవ్వాలని కోరింది. ఓకే సమయంలో ఒకే చోటికి రైడ్ బుక్ చేస్తున్నప్పటికీ ఎందుకు ధరలు విషయంలో తేడాలు కనిపిస్తున్నాయి… పారదర్శకత లేకుండా డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు అనే విషయంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది.
ఇక తాజాగా ఓ వ్యక్తి ఉబర్ వినియోగదారుల్ని మోసం చేస్తుందని.. ఒకే సమయానికి ఒకే చోట నుండి రైడ్ బుక్ చేస్తున్నప్పటికీ ధరల విషయంలో తేడా ఉందని సరిపోల్చి చూపించాడు. అంతేకాకుండా ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో ధరలు వేరు వేరుగా ఉన్నాయని.. ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తుందంటూ తెలిపాడు.
ALSO READ : Samsung Galaxy S24 vs Samsung Galaxy S25 : ఈ మెుబైల్స్ ఫీచర్స్ లో తేడాలు ఏంటబ్బా!
ట్విట్టర్ వేదికగా చేసిన ఈ పోస్ట్ తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ పోస్ట్ కు పలువురు వ్యక్తులు మద్దతు తెలిపారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఉబర్ స్పందించింది. యూజర్ ఉపయోగించే ఫోన్ ఆధారంగా ధరను నిర్ణయించడమనే విషయాన్ని నిరాకరించింది. పికప్ పాయింట్, వచ్చే సమయం, డ్రాప్ పాయింట్ ఆధారంగా మాత్రమే ఛార్జీల్లో వ్యత్యాసాలు ఉంటాయని చెప్పుకొచ్చింది. రైడర్ ఉపయోగించే మొబైల్, ఫోన్ ఛార్జింగ్ ద్వారా ట్రిప్ ధరను ఎప్పుడూ నిర్ణయించదని తెలిపింది. అయితే ఈ పోస్టుకు సోషల్ మీడియాలో పలువురు మద్దతు తెలిపారు. తమకు ఇలాంటి సంఘటనే ఎదురైందని.. ఆండ్రాయిడ్, ఐఫోన్ లో బుక్ చేసినప్పుడు ఒకే విధమైన రైడ్ ఛార్జీలు లేవని తెలిపారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన కేంద్రం.. యూజర్స్ ఆరోపణలపై సరైన వివరణ ఇవ్వాలని కోరింది. ఒకే సమయానికి రైడ్ బుక్ చేసినప్పటికీ ఎందుకు డబ్బులు విషయంలో వ్యత్యాసం ఉంటుందని ప్రశ్నించింది. వినియోగదారుల్ని మోసం చేయటం ఎందుకు జరుగుతుందని.. సరైన వివరణతో వెల్లడించాలని నోటీసులు పంపించింది. వినియోగదారుల దోపిడిని ప్రభుత్వ ఏ మాత్రం సహించదని.. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలంటూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని CCPAని ఆదేశించినట్లు జోషి తెలిపారు. మరి ఈ ఆరోపణపై ఉబర్, ఓలా ఎలా స్పందిస్తాయో… కేంద్రానికి ఎలాంటి వివరణ ఇస్తాయో చూడాలి.