E-Paper
Advertisement

Hair Spa: నిస్తేజమైన జుట్టుకు సంజీవని..హెయిర్ స్పా చేసే మ్యాజిక్ మీకు తెలుసా ?

Hair Spa: నిస్తేజమైన జుట్టుకు సంజీవని..హెయిర్ స్పా చేసే మ్యాజిక్ మీకు తెలుసా ?
Advertisement

Hair Spa: హెయిర్ స్పా అనేది కేవలం ఒక విలాసం మాత్రమే కాదు.. జుట్టు ఆరోగ్యానికి అదొక అవసరమైన చికిత్స. ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఎండ, ఒత్తిడి, రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల జుట్టు త్వరగా పాడైపోతుంది. అలాంటి సందర్భాల్లో హెయిర్ స్పా జుట్టుకు ప్రాణం పోస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

హెయిర్ స్పా వల్ల కలిగే ప్రయోజనాలు :

1. జుట్టు, స్కాల్ఫ్ శుభ్రత :

Advertisement

హెయిర్ స్పా ప్రక్రియలో జుట్టును లోతుగా శుభ్రపరుస్తారు. దీని వల్ల స్కాల్ఫ్ (మాడు) మీద పేరుకుపోయిన దుమ్ము, జిడ్డు, మృతకణాలు తొలగిపోతాయి. ఇది వెంట్రుకల రంధ్రాలు తెరుచుకునేలా చేసి.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహద పడుతుంది.

2. జుట్టుకు తగినంత తేమ:

హెయిర్ స్పాలో ఉపయోగించే క్రీములు, నూనెలు జుట్టుకు కావాల్సిన తేమను అందిస్తాయి. ఇది జుట్టు చిట్లిపోవడం, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల జుట్టు మృదువుగా.. మెరుస్తూ కనిపిస్తుంది.

3. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది:

స్పా సమయంలో చేసే మసాజ్ వల్ల తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను, ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. రక్త ప్రసరణ పెరగడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కొత్త జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది.

4. ఒత్తిడి నుంచి ఉపశమనం:

జుట్టు ఆరోగ్యమే కాకుండా.. హెయిర్ స్పా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. స్పా మసాజ్ వల్ల తలలోని నరాలు రిలాక్స్ అవుతాయి, దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి నిద్ర బాగా పడుతుంది.

5. చుండ్రు నివారణ:

స్కాల్ఫ్ మీద ఉండే నూనె గ్రంథుల పనితీరును హెయిర్ స్పా క్రమబద్ధీకరిస్తుంది. ఇది తల మీద చుండ్రు ఏర్పడకుండా నివారిస్తుంది. అలాగే.. మాడు మీద వచ్చే దురద, ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయ పడుతుంది.

హెయిర్ స్పాలో ఉండే సాధారణ దశలు:

షాంపూ : మొదట జుట్టును శుభ్రం చేసి మురికిని తొలగిస్తారు.

హెయిర్ మాస్క్ : పోషక విలువలున్న క్రీమును జుట్టుకు పట్టిస్తారు.

మసాజ్: సుమారు 15-20 నిమిషాల పాటు మాడుకు మసాజ్ చేస్తారు.

స్టీమింగ్ : ఆవిరి పట్టడం వల్ల క్రీములోని పోషకాలు కుదుళ్లలోకి వెళ్తాయి.

వాష్ : చివరగా జుట్టును కడిగి సీరం అప్లై చేస్తారు. 

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×