Popular Dog Breeds: సాధారణ వీధి కుక్కల కంటే.. బాగా డబ్బున్న వాళ్లు లేదా కుక్కలంటే ముచ్చటపడి పెంచుకునే పెంపుడు కుక్కలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ కుక్కల వేగం, శక్తి, శిక్షణ సామర్థ్యం వల్ల వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. నిజానికి కుక్క అంటే కేవలం పెంపుడు జంతువు మాత్రమే కాదు.. దీన్ని ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడిగానూ భావిస్తుంటారు. ఇంటి వాతావరణాన్ని.. ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, ఆనందంతో నింపే అద్భుతమైన స్నేహితుడు కుక్క. కాస్త దిగులుగా ఉన్నప్పుడు మన ఒత్తిడిని తగ్గించే శక్తి కుక్కలకే సాధ్యం. అలాంటి ముద్దులొలికే కుక్క పిల్లల్ని మీరూ కొనాలనుకుంటే.. కొన్ని కుక్క జాతుల గురించి, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి..
కాలం మారుతున్న కొద్దీ మనుషులు కూడా స్మార్ట్‌గా తయారవుతున్నారు. దీంతో ఇంట్లో పెంచుకునే కుక్కలు కూడా మేలైనదిగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే.. కాస్త ఖరీదైన వాటిని కొనుగోలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. దీనికి తగ్గట్టే చాలా సంస్థలు మేలు జాతి శునకాల్ని విక్రయిస్తున్నాయి. కస్టమర్ల ఇష్టాఇష్టాల్ని బట్టి అనేక రకాల జాతులకు చెందిన కుక్క పిల్లల్ని అందుబాటులో పెడుతున్నాయి. అయితే.. వాటిలో ఏది ఎంచుకోవాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అలాంటప్పుడు.. ఆయా జాతులకు ప్రత్యేక స్వభావం, శారీరక లక్షణాలు, సంరక్షణ అవసరాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. వాటిని అర్థం చేసుకుని, ప్రస్తుత మీ లైఫ్‌స్టైల్‌ను పరిశీలించుకుని.. మీకు సరిపోయే కుక్క పిల్లని ఇంటికి తెచ్చుకోండి.
భారతదేశంలో ఈ జాతి కుక్క పిల్లలు చాలా ఫేమస్. మంచి ఫ్రెండ్లీ నేచర్, చురుకైన స్వభావం కలిగి ఉన్న ఈ కుక్కలు.. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ తోనూ త్వరగా కలిసిపోయే లాబ్రడార్లు.. ముఖ్యంగా పిల్లలతో ఎంతో ప్రేమగా ఉంటాయి. బలమైన శరీరం, మందపాటి కోట్, మంచి తెలివితేటలతో ఇవి మంచి ఫ్యామిలీ డాగ్‌గా పేరుపొందాయి.
చూడగానే ముద్దొచ్చే కుక్క పిల్లలు కావాలంటే.. గోల్డెన్ రిట్రీవర్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఈ జాతి కుక్కలు మంచి తెలివైనవి, విధేయత చూపిస్తుంటాయి. అలాగే.. వీటికి శిక్షణ ఇవ్వడం కూడా చాలా సులభం. ఈ అందమైన గోల్డెన్ రిట్రీవర్ కుక్క పిల్లలు.. పెద్దల్నే కాదు ఇంట్లో చిన్న పిల్లల్ని సైతం ఆకట్టుకుంటాయి. చురుగ్గా ఉండే కుటుంబాలు ఈ జాతి కుక్కల్ని పెంచుకోవడం మంచి ఎంపిక.
భారీ ఆకారం.. చూడగానే గంభీరత కావాలి అనుకునే వారికి ఈ జాతి కుక్కలు సరైన ఎంపిక. ఫ్యామిలీ, ఇంటి భద్రతకు జర్మన్ షెపర్ట్ పెట్టింది పేరు. వాచ్ డాగ్‌గా, పోలీస్, రెస్క్యూ సమయాల్లో ఉపయోగించే ఈ జాతి కుక్కలు.. కుటుంబంతోనూ ఎంతో విధేయంగా ఉంటుంది. శక్తివంతమైన శరీరం, చురుకైన స్వభావం వీటిని ప్రత్యేకంగా నిలబెడతాయి.
ఈ బ్రీడ్ కుక్క పిల్లలు.. స్మాల్ నుంచి మీడియం సైజ్ వరకు అందుబాటులో ఉంటాయి. మంచి చలాకీగా, గెంతుతూ, పరుగులు పెడుతూ ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృస్టిస్తాయి ఈ బీగల్ జాతి కుక్కలు. ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. ఈ బ్రీడే కరెక్ట్. పిల్లలతో త్వరగా కలిసిపోయే స్వభావం వీటి ప్రధాన ఆకర్షణ. కొన్ని జాగ్రత్తగా తీసుకుంటే.. అపార్ట్‌మెంట్లో ఉండే వాళ్లు కూడా దీన్ని పెంచుకోవచ్చు.
ఈ జాతి కుక్కలు చూడటానికి కాస్త బొద్దుగా, నాలుక బయటపెట్టుకుని ఉంటాయి. అయితే ఇవి చాలా బలంగా ఉండాయి. కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం రాట్ వైలర్ కుక్కలను ఎంచుకోవడం ఉత్తమం. సహజంగానే వీటిలో ఉండే రక్షణ స్వభావం, బలమైన శారీరక నిర్మాణం.. ఈ జాతి కుక్కల్ని ఎంచుకునేలా చేస్తుంది. సరైన ట్రైనింగ్ ఇస్తే ఇవి మంచి ఫ్యామిలీ డాగ్‌లుగా మారుతాయి.