E-Paper
Advertisement

CM Chandrababu Naidu: నాడు పదవి కంటే రాష్ట్రమే ముఖ్యం అన్నాను.. పోలవరం కోసం నాటి పోరాటం గుర్తుందిగా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: నాడు పదవి కంటే రాష్ట్రమే ముఖ్యం అన్నాను.. పోలవరం కోసం నాటి పోరాటం గుర్తుందిగా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Advertisement

CM Chandrababu Naidu: తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో తాను పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినప్పుడు కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం గోదావరి జిల్లాలు ఎడారి అవుతాయని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.

గత పాలకుల అసమర్థత వల్ల గాడితప్పిన పాలనను తిరిగి బాగు చేయడానికి తమ సమయమంతా వెచ్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సుస్థిరమైన పాలన ఉంటేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఐదేళ్లకోసారి పాలకులను మార్చడం వల్ల రాష్ట్రానికి నష్టమే జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి పంటలను కాపాడటమే కాకుండా, అక్కడ పొదుపు చేసిన నీటిని శ్రీశైలం నుండి హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు అందించి ‘రాళ్ల సీమ’ను ‘రత్నాల సీమ’గా మారుస్తున్నామని వివరించారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లాను రాబోయే ఐదు నుండి పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తనకున్న నిబద్ధతను చాటుతూ, అప్పట్లో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తేనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ మండలాల విలీనం వల్లే నేడు పోలవరం పనులు సుగమమయ్యాయని, ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రసంగిస్తూ.. అమరావతి రాజధాని విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన ‘మూడు ముక్కల ఆట’ను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. విజయవాడ, రాజమండ్రి, లండన్ వంటి నగరాలన్నీ నదుల పక్కనే ఉన్నాయని గుర్తుచేస్తూ, నది పక్కన రాజధాని కడుతున్నారని విమర్శించే వారికి ఇంగిత జ్ఞానం లేదని మండిపడ్డారు. 2021లోనే పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం విధ్వం

తిరుమల పవిత్రత, సామాజిక అంశాలపై స్పందిస్తూ.. గత ప్రభుత్వం ప్రసాదం నెయ్యిని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పవిత్రతను పునరుద్ధరించామని చెప్పారు. కొండపై మద్యం బాటిళ్లు వేసి అపవాదు వేయాలని చూసిన వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని తెలిపారు. అలాగే, కోవిడ్ సమయంలో మాస్కు అడిగినందుకు వేధింపులకు గురై ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ సుధాకర్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల పరిహారం అందజేశామని, గత ప్రభుత్వ పాపాలను కడిగేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Read Also: సికింద్రాబాద్ అంటే గుండె చప్పుడు.. ఆ పేరును ఎలా మారుస్తారు?

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×