E-Paper
Advertisement

Pretty Look: సింపుల్‌గా ఉంటూనే ‘ప్రెట్టీ’గా కనిపించడం ఎలా ? 15 సీక్రెట్స్ మీ కోసం!

Pretty Look: సింపుల్‌గా ఉంటూనే ‘ప్రెట్టీ’గా కనిపించడం ఎలా ? 15 సీక్రెట్స్ మీ కోసం!
Advertisement

Pretty Look:సహజ సిద్ధమైన అందం అనేది కేవలం ముఖానికి వేసుకునే రంగుల్లో ఉండదు. అది మన జీవనశైలి, ఆత్మ విశ్వాసంలో ఉంటుంది. నేటి సోషల్ మీడియా కాలంలో ఫిల్టర్లు, మేకప్ లేకుండా అందంగా కనిపించడం అసాధ్యం అని చాలామంది భావిస్తుంటారు. కానీ.. చర్మ సంరక్షణ, సరైన ఆహారం, మానసిక ప్రశాంతత ద్వారా ఏ విధమైన కృత్రిమ హంగులు లేకుండానే అద్భుతంగా మెరిసిపోవచ్చు. మేకప్ బ్రష్‌లు పక్కన పెట్టి.. సహజంగా ‘ప్రెట్టీ’గా కనిపించే 15 మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేకప్ లేకుండా అందంగా కనిపించే 15 మార్గాలు:

Advertisement

1. తగినంత నీరు తాగడం:
చర్మం లోపలి నుంచి హైడ్రేటెడ్ గా ఉంటేనే సహజమైన మెరుపు వస్తుంది. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

2. సరైన నిద్ర :
రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర చాలా అవసరం. నిద్రలేమి వల్ల కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. నిద్రలోనే మన చర్మ కణాలు రిపేర్ అవుతాయి.

Advertisement

3. చర్మ శుభ్రత :
ప్రతిరోజూ ఉదయం, రాత్రి క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

4. ఐబ్రోస్ ఆకారం:
కనుబొమ్మలు ముఖానికి ఒక ఫ్రేమ్ లాంటివి. వాటిని క్రమం తప్పకుండా ట్రిమ్ చేయించుకోవడం వల్ల ముఖం నీట్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

5. పెదవుల సంరక్షణ:
పెదవులు పొడిబారకుండా లిప్ బామ్ లేదా నెయ్యి రాసుకోవాలి. వారానికి ఒకసారి పంచదారతో స్క్రబ్ చేస్తే.. పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి.

6. హెయిర్ కేర్:
జుట్టు శుభ్రంగా, చిక్కులు లేకుండా ఉంటే సగం అందం వచ్చేసినట్లే. మీ ముఖానికి సెట్ అయ్యే హెయిర్ స్టైల్‌ను ఎంచుకోండి.

7. చిరునవ్వు :
ఏ మేకప్ ఇవ్వలేని అందాన్ని ఒక చిన్న చిరునవ్వు ఇస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తి ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు.

8. సన్ స్క్రీన్ వాడకం:
ఎండలోకి వెళ్లినప్పుడు మాత్రమే కాదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ వాడాలి. ఇది చర్మంపై మచ్చలు, ముడతలు రాకుండా కాపాడుతుంది.

9. ఆరోగ్యకరమైన ఆహారం:
పండ్లు, ఆకుకూరలు, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న ఆహారం చర్మానికి మంచి గ్లో ఇస్తుంది.

10. వ్యాయామం:
రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ముఖంలో సహజమైన ఎరుపు వస్తుంది.

11. మంచి పోశ్చర్:
వంగి నడవకుండా.. వెన్నుముక నిటారుగా ఉంచి నడవడం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో.. అందంగా కనిపిస్తారు.

12. తెల్లటి పళ్లు:
దంతాల శుభ్రత చాలా ముఖ్యం. పళ్లు తెల్లగా ఉంటే మీ నవ్వు మరింత ప్రకాశవంతంగా ఉంటుంది.

13. బట్టల ఎంపిక:
మీకు నప్పే రంగులు, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.

14. నెయిల్ కేర్:
చేతులు, కాళ్ల గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మీరు ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్‌గా కనిపిస్తారు.

15. ఆత్మవిశ్వాసం:
అన్నిటికంటే ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. మీరు అందంగా ఉన్నారని మీరు నమ్మినప్పుడే ప్రపంచానికి కూడా అలాగే కనిపిస్తారు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×