E-Paper
Advertisement

గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో నిమిషాల్లో ఉపశమనం!

గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో నిమిషాల్లో ఉపశమనం!
Advertisement

Sore Throat Remedies: మారుతున్న కాలంతో పాటు గొంతు నొప్పి, గొంతులో మంట వంటి సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ప్రతి చిన్న విషయానికి యాంటీ బయోటిక్స్ వాడటం కంటే.. మన అమ్మమ్మల కాలం నాటి ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. గొంతు నొప్పిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే.. మన వంటింట్లో దొరికే అల్లం, తేనె, పసుపు వంటి పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చు. గొంతులో వాపును తగ్గించి.. హాయిని ఇచ్చే ఆ 7 పవర్‌ఫుల్ హోమ్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గొంతు నొప్పిని తగ్గించే అద్భుతమైన చిట్కాలు:
గొంతు నొప్పి వస్తే ఆహారం మింగడం కష్టంగా మారడమే కాకుండా.. మాట కూడా సరిగ్గా రాదు. వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ నొప్పిని తగ్గించుకోవడానికి ఈ కింది చిట్కాలు పాటించండి.

Advertisement

1. ఉప్పు నీటితో పుక్కిలించడం:
గొంతు నొప్పికి ఇది అత్యంత ప్రభావవంతమైన చిట్కా. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి రోజుకు మూడు, నాలుగు సార్లు పుక్కిలించాలి. ఇది గొంతులోని కణజాలం నుంచి అదనపు తేమను తీసివేసి, వాపును, బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

2. తేనె – సహజ సిద్ధమైన మందు:
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతులో మంటను తగ్గించి, ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో లేదా హెర్బల్ టీలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగితే దగ్గు కూడా తగ్గుముఖం పడుతుంది.

Advertisement

3. అల్లం టీ :
అల్లం గొప్ప యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పని చేస్తుంది. అల్లం ముక్కలను నీటిలో మరిగించి.. ఆ కషాయాన్ని తాగడం వల్ల గొంతులోని ఇన్ఫెక్షన్ కలిగించే.. బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

4.పసుపు పాలు:
పసుపును ఆయుర్వేదంలో సహజ యాంటీ బయోటిక్ అని పిలుస్తారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు,మిరియాల పొడి కలిపి తాగితే గొంతు నొప్పి మాయమవడమే కాకుండా.. శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

5. మిరియాల పొడి:
గొంతులో గిరగిర అనిపిస్తుంటే.. అర చెంచా తేనెలో కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని తీసుకుంటే గొంతు క్లియర్ అవుతుంది. మిరియాల్లోని వేడి ఇన్ఫెక్షన్‌ను త్వరగా తగ్గిస్తుంది.

6. యాపిల్ సైడర్ వెనిగర్:
దీనిలోని అసిడిక్ స్వభావం గొంతులోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి పుక్కిలిస్తే ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది.

7. ఆవిరి పట్టడం:
ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళాలు శుభ్రపడతాయి. నీటిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ లేదా పసుపు వేసి ఆవిరి పడితే గొంతులో తేమ చేరి నొప్పి తగ్గుతుంది.

Also Read: పుచ్చకాయ తొక్కతో మతిపోయే లాభాలు.. ఇకనుంచైనా పడేయకండి!

కొన్ని అదనపు జాగ్రత్తలు:
విశ్రాంతి: గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకండి.

హైడ్రేషన్: శరీరం పొడిబారకుండా నీరు లేదా పండ్ల జ్యూస్‌లు (పులుపు లేనివి) తీసుకుంటూ ఉండాలి.

చల్లని పదార్థాలకు దూరం: ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ , నూనెలో వేయించిన పదార్థాలను ఇన్ఫెక్షన్ తగ్గే వరకు పక్కన పెట్టండి.

ఈ చిట్కాలు సాధారణ గొంతు నొప్పికి బాగా పనిచేస్తాయి. అయితే.. నొప్పి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉన్నా, తీవ్రమైన జ్వరం వచ్చినా లేదా మింగడం అస్సలు సాధ్యం కాకపోయినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

 

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×