E-Paper
Advertisement

73 Year Old Man: 73 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్.. కుర్రాళ్లను కళ్లు తిప్పుకోకుండా చేస్తున్న వృద్ధుడి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

73 Year Old Man: 73 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్.. కుర్రాళ్లను కళ్లు తిప్పుకోకుండా చేస్తున్న వృద్ధుడి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
Advertisement

73 Year Old Man: సాధారణంగా 70 ఏళ్లు దాటాయంటే చాలామంది విశ్రాంతి తీసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. కానీ, అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఈ అల్ గెరార్డ్ అనే 73 ఏళ్ల వృద్ధుడు మాత్రం జిమ్‌లో ఇప్పటికీ కసరత్తులు చేస్తూ యువకులకు చెమటలు పట్టిస్తున్నాడు. కండలు తిరిగిన శరీరం, కుర్రాళ్లు సైతం కుళ్లుకునేలా సిక్స్ ప్యాక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ మార్క్ లాంగోస్కీతో జరిగిన సంభాషణలో..  తన శరీరాన్ని ఈ వయసులో కూడా ఇంత దృఢంగా ఎలా ఉంచుకున్నాడో వివరించాడు. తన పుట్టినరోజుకు సరిగ్గా ఒకరోజు ముందు ఈ రహస్యాలను బయటపెట్టడం విశేషం.

కృత్రిమ పద్ధతి కాదు.. అతని కష్టార్జితమే:

చాలామంది ఇతని శరీరాన్ని చూసి.. ఏదైనా టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ లేదా హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నాడేమో అనుకుంటుంటారు. కానీ ఈ వృద్ధుడు ఆ వాదనలను పూర్తిగా కొట్టిపారేశాడు. తన దేహం కేవలం క్రమబద్ధమైన దినచర్య వల్ల మాత్రమే సాధ్యమైందని గర్వంగా చెబుతున్నాడు. ఇక వర్కౌట్ విషయానికి వస్తే.. రోజు విడిచి రోజు 100 పుషప్స్, 100 పులప్స్ చేయడం ఇతడి ప్రత్యేకత. ఫిట్‌నెస్ కోచ్ ముందే అలవోకగా 36 పుషఅప్స్ తీసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

Advertisement

Also Read: పాదాలు అందవిహీనంగా మారాయా? పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కోమలంగా మార్చుకోండిలా!

ఆహారమే అసలైన ఔషధం:

వ్యాయామంతో పాటు ఆహారం విషయంలో ఈ వృద్ధుడు తీసుకునే జాగ్రత్తలే ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. తాను పిండి పదార్థాలను చాలా తక్కువగా తీసుకుంటాడని, అదే తన ఫిట్‌నెస్‌కు అసలైన కీలకమని వివరించారు. సప్లిమెంట్స్ విషయానికి వస్తే.. కేవలం వే ప్రోటీన్, కొల్లాజెన్, క్రియేటిన్ వంటి సహజమైన వాటినే ఎంచుకుంటాడట. అలాగే నెలకు ఒకసారి తప్పనిసరిగా ఉపవాసం ఉండటం అతని దినచర్యలో భాగం. సరదాగా తన డైట్ గురించి చెబుతూ.. ఉపవాసం లేని రోజుల్లో ఒకటి లేదా రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగుతానని నవ్వుతూ చెప్పాడు.

ఓ అక్కటి మానేశాడు.. 

Advertisement

అల్ గెరార్డ్ తన రోజూవారీ డైట్‌లో చక్కెరను పూర్తిగా నిలిపివేశాడు. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, బాడీ ఫ్యాట్ తక్కువగా ఉంచుకోవడానికి చక్కెరను మానేయడమే అత్యంత ప్రధానమైన మార్పు అని ఆయన చెబుతుంటారు. అల్ గెరార్డ్ ఫిట్‌నెస్‌లో 80% ఆహారం, మిగిలిన 20% మాత్రమే వ్యాయామం అని ఆయన బలంగా నమ్ముతారు. అలాగే ఆయన ప్యాకెట్లలో దొరికే జంక్ ఫుడ్, మైదా వంటి వాటికి దూరంగా ఉంటారు. అన్నం, బ్రెడ్, పాస్తా వంటి కార్బోహైడ్రేట్లు కూడా చాలా తక్కువగా తీసుకుంటారట.

వయసును ఓడించిన సంకల్పం:

ఈ వయసులో కూడా ఆయన బాడీ ఫ్యాట్ శాతం కేవలం 8.5% మాత్రమే ఉండటం ఎంతో మందిని విస్మయానికి గురి చేస్తోంది. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్‌కు ఉండాల్సిన ఫిట్‌నెస్ లెవల్స్‌ను ఈ 73 ఏళ్ల వయసులో ఆయన మెయింటైన్ చేస్తున్న తీరు అద్భుతం. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సరైన పోషకాహారం ఉంటే వయసు అనేది ఒక అంకె మాత్రమేనని ఆయన నిరూపిస్తున్నారు. ముసలితనం అంటే.. మంచానికే పరిమితం కావడం కాదు, సరైన పద్ధతుల్లో ప్రయత్నిస్తే ఏ వయసులోనైనా బలంగా, ఫిట్‌గా ఉండవచ్చని ఈ సూపర్ మ్యాన్ ప్రపంచానికి చాటి చెబుతున్నాడు.

ఆ సూపర్ మ్యాన్ వీడియో ఇదిగో..

?utm_source=ig_web_button_share_sheet

Also Read: గుడ్డు తెల్లసొనను ఇలా వాడితే 40లోనూ యవ్వనమైన మెరుపు గ్యారెంటీ.. మీరూ ట్రై చేస్తారా మరి?

 

 

Tags

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×