BigTV English

Anant Ambani : అనంత్ అంబానీ మళ్లీ అంత బరువు ఎలా పెరిగారు..?

Anant Ambani : అనంత్ అంబానీ మళ్లీ అంత బరువు ఎలా పెరిగారు..?

Anant Ambani


Anant Ambani : అనంత్ అంబానీ-రాధికా మర్చంట్.. తెలియని వారుండరు. ఇప్పుడు వీరిద్దరి వివాహమే హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులుగా అందరూ వీరి వివాహం గురించే మాట్లాడుకుంటున్నారు. ఎంతటి వారైనా.. ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాల్సిందే. ఉన్నత కుటుంబాలకు చెందినవారు తమ జీవితభాగస్వామి తమకు సరిజోడి అయి ఉండాలని ఆరాటపడతారు.

కానీ ఇక్కడ అనంత్-రాధికలను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఎవరికీ అనిపించదంటే తప్పు లేదు కదా. రాధికా మర్చంట్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె పక్కన అనంత్.. చాలా లావుగా కనిపిస్తున్నాడు. వీరిది లవ్ మ్యారేజ్ అని తెలిసి అందరూ ఆశ్యర్యపోతున్నారు.


Read More : కోల్డ్ వాటర్ థెరపీ బెనిఫిట్స్.. గురించి మీకు తెలుసా..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ-నీతా అంబానీ దంపతుల చిన్న కొడుకు పెళ్లిని అంగరంగవైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 12న ఎన్ కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చంట్-షైలా మర్చంట్ ఏకైక కుమార్తె రాధికా మర్చంట్ ను అనంత్ అంబానీ పెళ్లాడనున్నాడు. అంతకంటే ముందు వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్ నగర్ అంగరంగ వైభవంగా జరగనుంది.

మార్చి 1న అట్టహాసంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకు సినీ, క్రీడ, రాజకీయ, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. అయితే.. అంత అందంగా ఉన్న రాధిక పక్క అనంత్ అలా కనిపించడానికి కారణమేంటి ? ఏ కారణం చేత అంత బరువు పెరిగాడో తెలుసుకుందాం.

అనంత్ అంబానీ.. 2013 సమయంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో కనిపించాడు. అప్పట్లోనే చాలా లావుగా కనిపించాడు. 2016 సమయంలో చాలా సన్నంగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 208 కిలోల బరువు నుంచి 100 కిలోలకు బరువు తగ్గాడు. రోజుకు ఐదారుగంటలు వ్యాయామం, 21 కిలోమీటర్ల నడక వంటి డైట్ పాటించారు.

ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ వినోద్ చన్నా అనంత్ కు డైట్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అనంత్ మళ్లీ బయటెక్కడా కనిపించలేదు. రాధికా మర్చంట్ తో రోకా సెర్మనీ, నిశ్చితార్థం సమయాల్లో కనిపించిన అనంత్ ను చూసి ఇంత లావున్నాడేంటని అంతా షాకయ్యారు.

2017లో బరువు తగ్గి కనిపించిన అనంత్ ను చూసి అబ్బా.. ఏమున్నాడు అనుకున్నవారంతా.. ఇప్పుడు ఏంట్రా ఇలా తయారయ్యాడని అంటున్నారు. యూఎస్ బ్రౌన్ యూనివర్సిటీ ఉన్నత విద్యను అభ్యసించిన అనంత్.. ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బాధ్యతలను చేపట్టాడు.

Read More : ఓమైగాడ్.. ఓట్స్‌తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..!

అనంత్ అంబానీ ఇలా బరువు పెరగడానికి గల కారణాలను అతని తల్లి నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అనంత్‌కు ఆస్తమా సమస్య ఉందని, దానికి స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా తీసుకోల్సి ఉంటుందని చెప్పారు. వీటి ఎఫెక్ట్ వల్లనే బరువు పెరగాడని చెప్పుకొచ్చారు.

అయితే తన కుమారుడు ఆనంత్‌లా ఊబకాయంతో బాధపడుతున్న వారు సమాజంలో చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని చిన్నచూపు చూడొద్దని కోరారు. ఆస్తమా సమస్య ఎక్కువగా ఉన్నవారికి ఆస్పత్రిలో చేరే అవసరం లేకుండా.. స్టెరాయిడ్స్ ను సజెస్ట్ చేస్తుంటారు నిపుణులు.

Related News

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Big Stories

×