BigTV English

Oats Benefits : ఓమైగాడ్.. ఓట్స్‌తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..!

Oats Benefits : ఓమైగాడ్.. ఓట్స్‌తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..!

oats health benefits


Oats Health Benefits : ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మనలో చాలా మంది ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల ఆహారాలు తీసుకుంటుంటారు. అందులో ఓట్మిల్ కూడా ఒకటి. ఓట్మిల్ ప్రతి రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కూడా సురక్షితంగా ఉంటుంది. ఓట్మీల్ తినడం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓట్స్‌ను ఎక్కువ శాతం అల్పాహారంలో భాగంగా తీసుకుంటారు. ప్రతి రోజూ ఓట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నేడు వేగంగా మారుతున్న జీవనశైలి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న పని ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆహారంలో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చిని నిపుణులు సూచిస్తున్నారు.


Read More : కోల్డ్ వాటర్ థెరపీ బెనిఫిట్స్.. గురించి మీకు తెలుసా..?

ఓట్స్‌ ఒక రకమైన తృణధాన్యాలు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్, మాంగనీస్, భాస్వరం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఓట్స్‌లో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. 2014లో న్యూట్రిషన్ జర్నల్‌ జరిపిన అధ్యయనం ప్రకారం.. ఆకలిని తగ్గించడంలో ఓట్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఆరోగ్యకరమైన ఆహారంలో ఓట్మీల్ కూడా ఒకటి. ఇది తయారు చేయడం చాలా సులభం. తినడానికి రుచికరంగా ఉంటుంది. ఓట్ మీల్ మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయొచ్చు. చాలా మందికి ఓట్మీల్ ప్రయోజనాలు తెలియకపోవడం వల్ల దాన్ని తినడం లేదు.

ఓట్మీల్ ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తి

ఓట్స్‌లో ఫైబర్, బీటా గ్లూకాన్ ఉంటాయి. ఇవి శరీరంపై గాయాలు ఉంటే నయం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంచుతాయి.

డయాబెటిస్

ఓట్స్‌లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్న ఓట్మీల్ మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.

గుండె

ఓట్స్‌లో అధికశాతం యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీని కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

క్యాన్సర్‌

ఓట్స్.. యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. అదేవిధంగా అండాశయాలు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా పోరాడుతాయి.

అధిక బరువు

ఓట్స్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఆహారం ఎక్కువగా తినరు.
కారణంగా బరువు అదుపులో ఉంటుంది.

మొటిమలు

ఓట్స్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొటిమలతో పోరాడటంతో పాటు చర్మంలో ఉండే అదనపు నూనెను గ్రహిస్తుంది. దీని కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Disclaimer : ఈ కథనాన్ని పలు అధ్యాయనాలు, హెల్త్ జర్నల్స్ ఆధారంగా రూపొందించాం. దీనిని సమాచారంగా మాత్రమే భావించండి.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×