E-Paper
Advertisement

Skipping Breakfast: బరువు పెరుగుతున్నామని బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తున్నారా..? ఇక మీ పని అంతే..!

Skipping Breakfast: బరువు పెరుగుతున్నామని బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తున్నారా..? ఇక మీ పని అంతే..!
Advertisement

Side Effects of Skipping Breakfast for Weight Loss: అల్పాహారం తినడం చాలా ముఖ్యం. రోజంతా చురుకుగా ఉండడానికి బ్రేక్ ఫాస్ట్ తప్పకుండా తినాలి. చాలా మంది ప్రస్తుతం అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి లాంటి వారు బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కాస్త బరువు పెరిగారు అంటే చాలు బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారనేది మంచి ఆలోచన కానే కాదు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల అది ఆ రోజులో మరింత ఎక్కువ ఆహారం తినడానికి కారణం అవుతుంది.

సరైన సలహాతో డైట్ పాటిస్తే కాస్త బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఎవరో చెప్పింది పాటించడం తెలిసీ తెలియని వారి సలహాలు పాటిస్తే బరువులో ఏ మాత్రం తేడా కనిపించదు. రోజు మీరు చేసే కొన్ని తప్పుల వల్ల కూడా మీరు బరువు పెరుగుతుంటారు. అయితే రోజు ఉదయం చేసే కొన్ని పొరపాట్ల గురించి తెలుసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు.

Advertisement

ఉదయం పూట చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ మానేయడంతో పాటు ఆ రోజులో కూడా తక్కువ తినాలి అని అనుకుంటారు. ఇలా చేస్తే బరువు తగ్గుతామని భావిస్తుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదం అని అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా ఇలా చేస్తే బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీని జీర్ణక్రియ మందగించి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

Also Read: జాజికాయను ఇలా తీసుకుంటే.. ఎన్ని అద్భుత ప్రయోజనాలో తెలుసా..

Advertisement

శరీరంలో మెటబాలిజం బరువు పెరిగేలా చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉంటే లంచ్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఆకలి వేస్తే ఏదో ఒకటి తినేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా మీ బరువు పెరుగుతుంది. కొందరు ఉదయం నిద్ర లేచి న తర్వాత సమయం లేదని అల్పాహారం మానేస్తుంటారు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు పెరుగుతారని అంటున్నారు.

ఇక ఈ సమస్య నుంచి బయటపడడానికి ఓట్స్ తీసుకోవడం బెటర్. సమయం దాటి ఎప్పుడు కూడా ఫుడ్ తినకూడదు. ఆహారం తినే విషయంలో ఖచ్చితమైన సమయం పాటించాలి. ప్రతి రోజు ఒకే సమయానికి భోజనం చేయాలి. అయితే ఒకేసారి ఎక్కువ తినడం కంటే కొంచెం కొంచెంగా తినడం చాలా ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జీర్ణక్రియ కూడా సులభతరమవుతుందని అంటున్నారు.

Related News

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

Big Stories

Advertisement
×