E-Paper
Advertisement

AI Answers: ఆరోగ్య సమస్యలకు ఏఐని సలహాలు అడుగుతున్నారా? కొన్నిసార్లు ప్రాణానికే ప్రమాదం

AI Answers: ఆరోగ్య సమస్యలకు ఏఐని సలహాలు అడుగుతున్నారా? కొన్నిసార్లు ప్రాణానికే ప్రమాదం
Advertisement

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చాలా మంది ముందుగా మొబైల్ తీసి ఇంటర్నెట్‌లో వెతకడం లేదా ఏఐ చాట్‌బాట్‌లను అడగడం వంటివి చేస్తున్నారు. దగ్గు, జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యల గురించి వెంటనే సమాధానం దొరుకుతుందని భావించి చాలామంది వీటిపై ఆధారపడుతున్నారు. అయితే తాజా అధ్యయనం మాత్రం ఇది చాలా ప్రమాదమని చెబుతోంది. ఆరోగ్య సమస్యల విషయంలో ఏఐ చాట్‌బాట్‌లను పూర్తిగా నమ్మడం ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. సరైన వైద్య పరీక్షలు లేకుండా, నిపుణుల సలహా లేకుండా కేవలం ఆన్‌లైన్ సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగకరమే అయినా, వైద్య విషయాల్లో మాత్రం వైద్యులనే నమ్మాలని వారు చెబుతున్నారు.

గూగుల్ ను వదిలేశారు
ఈ అధ్యయనంలో ఏఐ చాట్‌బాట్‌లు, Google ఇచ్చే సమాచారం మధ్య పోలికలు పరిశీలించారు. చాలామంది గూగుల్‌ సమాచారం అర్థం కాక ఏఐను ఉపయోగిస్తున్నారు. కానీ పరిశోధకుల అధ్యయనంలో చాట్‌బాట్‌లు గూగుల్ కంటే ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చిన సందర్భాలు తక్కువగా ఉన్నాయని తేలింది. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ లేదా చికిత్సకు సంబంధించిన సూచనల్లో స్పష్టత లేదని గుర్తించారు. కొన్నిసార్లు సాధారణ లక్షణాలకే తీవ్రమైన వ్యాధుల సూచనలు ఇవ్వడం, లేదా తీవ్రమైన సమస్యలను సాధారణంగా చూపించడం వంటి తప్పులు కనిపించాయని తెలిపారు. దీంతో వినియోగదారులు భయపడే పరిస్థితి లేదా నిర్లక్ష్యం చేసే పరిస్థితి రెండూ ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

చాట్‌బాట్‌లలో మరో సమస్య ఏమిటంటే… మనం అడిగే ప్రశ్నలో చిన్న మార్పు చేసినా సమాధానం పూర్తిగా మారిపోవచ్చు. ఒకే సమస్య గురించి వేర్వేరు పదాలతో అడిగితే వేర్వేరు సూచనలు రావడం సాధారణంగా కనిపిస్తోంది. దీనివల్ల ఏది నిజం, ఏది తప్పు అనే విషయం సాధారణ ప్రజలకు అర్థం కావడం కష్టమవుతోంది. కొన్నిసార్లు వాస్తవానికి సరిపోని సమాచారాన్ని కూడా చాలా నమ్మకంగా చెప్పే పరిస్థితి ఉంటుంది. దీనిని నిపుణులు టెక్నాలజీ భాషలో హాల్యూసినేషన్ అని అంటారు. అంటే నిజం కాని విషయాన్ని నిజంలా చూపించడం. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. గత వైద్య చరిత్ర, వయస్సు, జీవనశైలి, ఇతర వ్యాధులు వంటి అనేక అంశాలు చికిత్సలో కీలకం. కానీ ఏఐ సాధనాలు ఈ వివరాలను పూర్తిగా అర్థం చేసుకోలేవు. అందువల్ల సాధారణ సమాచారం మాత్రమే ఇవ్వగలవు. కానీ సరైన వైద్య సలహా ఇవ్వలేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వైద్యులనే అడగాలి
వైద్యులు చెబుతున్న ప్రకారం ఆరోగ్య సమస్యల విషయంలో ఏఐ చాట్‌బాట్‌లు లేదా ఇంటర్నెట్‌పై ఆధారపడకూడదు. ఇవి కేవలం ప్రాథమిక అవగాహన కోసం ఉపయోగపడే సాధనాలు మాత్రమే. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. పరీక్షలు, నివేదికలు, వైద్య పరిశీలన ఆధారంగా మాత్రమే సరైన చికిత్స నిర్ణయించవచ్చు. స్వయంగా మందులు వాడటం లేదా ఆన్‌లైన్ సూచనలు పాటించడం వల్ల కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. టెక్నాలజీ మన జీవితాన్ని సులభంగా చేస్తున్నా, ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో ఏ సందేహం వచ్చినా వెంటనే నిపుణుడిని సంప్రదించడం ఉత్తమ మార్గమని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

Related News

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

Big Stories

Advertisement
×