E-Paper
Advertisement

Dhurandhar: పైరసీలో కూడా దుమ్ము దులిపేస్తున్న ధురంధర్!

Dhurandhar: పైరసీలో కూడా దుమ్ము దులిపేస్తున్న ధురంధర్!
Advertisement

Dhurandhar: రణవీర్ సింగ్(Ranveer Singh) హీరోగా, ఆదిత్య ధర్(Adithya Singh)దర్శకత్వంలో సారా అర్జున్(Sara Arjun) హీరోయిన్గా నటించిన చిత్రం ధురంధర్.ఈ సినిమాను పాకిస్తాన్ తో పాటు యూఏఈ కొన్ని దేశాలు కూడా నిషేధించాయి. ఇక పాకిస్థాన్లో భారతీయ సినిమాలపై గత కొన్ని సంవత్సరాలుగా నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయకపోయినా.. సినిమాలు మాత్రం పాకిస్తానీయులు చూసేస్తున్నారు. దీంతో ఈ సినిమాకి ఊహించని పాపులారిటీ లభిస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పాకిస్తాన్లో విపరీతమైన క్రేజ్..

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా అటు ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా అక్కడక్కడ థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది.ముఖ్యంగా పాకిస్తాన్ కి వెళ్లి ఉగ్రవాదులతో కలిసి వారిపై నిఘా పెట్టే ఒక స్పై ఏజెంట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద 1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి దూసుకుపోతోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 11 దేశాలలో ఈ సినిమా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి సెన్సార్ కారణాల వల్ల ఈ సినిమాను గల్ఫ్ దేశాలతో పాటు పాకిస్తాన్లో కూడా విడుదలకు నిషిద్ధం విధించింది సెన్సార్ బోర్డ్..

Advertisement

ALSO READ:Drishyam 3: దృశ్యం3 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

పైరసీ రూపంలో..

అయినప్పటికీ కూడా ఈ ధుదురంధర్ సినిమా పాకిస్తాన్లో తెగ వైరల్ అవుతుంది. అక్కడి ప్రజలు ఈ సినిమాను పైరసీ కాపీలను కొనుగోలు చేసి మరీ చూస్తున్నారు. ధురంధర్ సినిమాలో పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున పైరసీ చేస్తూ ఉండడం గమనార్హం . ఇందుకు సంబంధించిన వీడియో ని ఒక విదేశీ పర్యాటకుడు కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో భారతదేశాన్ని సందర్శించిన ట్రావెల్ యూట్యూబర్ కర్ల్ రాక్ ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ధురంధర్ సినిమా డివిడిలు కరాచీలోని ఒక మార్కెట్లో అమ్మడు అవుతున్నట్లు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. సినిమా డివిడి అమ్ముడు అవుతున్న వీడియోని కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇకపోతే పాకిస్తాన్ మార్కెట్లో ఈ సినిమా డివిడిలు కేవలం 16 రూపాయలకు మాత్రమే లభ్యమవుతుండడం పైగా డీవీడీ దుకాణాలు ప్రకటనల కోసం ఈ సినిమా పెద్ద పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు.

పాకిస్తానీయులు మెచ్చిన ఇండియన్ మూవీ..

Advertisement

ఈ సినిమా పాకిస్తానీయులకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అక్కడి ప్రజలు మాత్రం ఈ సినిమాను తెగ చూసేస్తూ ఉండడం గమనార్హం ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు కూడా పాకిస్తాన్లో బాగా ప్రాచుర్యం పొందాయట. వివాహాలతో పాటు ఇతర కార్యక్రమాలలో కూడా ప్రజలు ఈ సినిమా పాటలకు డాన్స్ చేస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా ఈ సినిమా అటు పాకిస్తాన్లో ముఖ్యంగా పైరసీలో కూడా సంచలనం సృష్టిస్తూ ఉండడం గమనార్హం.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×