E-Paper
Advertisement

Cooling foods: వేసవిలో చలువు చేసే ఆహారాలు ఇవిగో.. ఆయుర్వేదం కూడా చెబుతోంది

Cooling foods: వేసవిలో చలువు చేసే ఆహారాలు ఇవిగో.. ఆయుర్వేదం కూడా చెబుతోంది
Advertisement

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బయటకు వెళ్లగానే వేడి గాలులకు శరీరం అలసిపోతుంది. చాలామందికి తలనొప్పి, దాహం, బలహీనత లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో శరీరాన్ని కూల్‌గా ఉంచడం చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం ఆహారం సరిగ్గా ఎంచుకుంటే వేడి ప్రభావం తగ్గించుకోవచ్చు. తేలికగా జీర్ణమయ్యే, నీరు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే శరీరం లోపల చల్లదనం పెరుగుతుంది. అందుకే కొన్ని సింపుల్ ఫుడ్స్ వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ
మొదటగా పుచ్చకాయ గురించి చెప్పుకోవాలి. వేసవిలో అందరికీ సులభంగా దొరికే ఈ పండు శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో నీటి శాతం చాలా ఎక్కువ. ఒక బౌల్ పుచ్చకాయ తింటే దాహం తగ్గుతుంది, శరీరం కూల్‌గా ఫీల్ అవుతుంది. బయట నుంచి వచ్చాక పుచ్చకాయ తింటే వెంటనే రిలీఫ్ లభిస్తుంది. అలాగే ఇది తేలికగా జీర్ణమవుతుంది. బరువుగా అనిపించదు. రోజూ కొద్దిగా తింటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

Advertisement

దోసకాయ
దోసకాయ కూడా వేసవిలో బెస్ట్ ఆప్షన్. దీనిలో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది. సలాడ్‌గా తినచ్చు, నేరుగా ముక్కలు చేసి తినచ్చు. ఎక్కువగా వండాల్సిన పని లేదు. సింపుల్‌గా తింటే సరిపోతుంది. ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఎక్కువగా వేడి అనిపించినప్పుడు దోసకాయ తింటే కాస్త కూల్‌గా ఫీల్ అవుతుంది. అందుకే చాలామంది వేసవిలో దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటారు.

కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లు వేసవిలో చాలా మంచివి. ఇవి సహజమైన ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తాయి. శరీరానికి నీరు అందిస్తాయి, వేడి తగ్గిస్తాయి. అలసట తగ్గుతుంది. బయట ఎక్కువసేపు తిరిగిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే శరీరం తేలికగా అనిపిస్తుంది. కొబ్బరి ముక్కలు కూడా తినచ్చు. ఇవి కూడా చల్లదనం ఇస్తాయి.

Advertisement

సోంపు
సోంపు ఆరోగ్యానికి మంచిది. భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమిలితే జీర్ణం సులభంగా జరుగుతుంది. కడుపులో వేడి తగ్గుతుంది. వేసవిలో గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో సులభంగా దొరికే పదార్థం కావడంతో దీనిని డైలీ ఉపయోగించవచ్చు.

కొత్తిమీర కూడా శరీరానికి చల్లదనం ఇస్తుంది. మనం సాధారణంగా వంటల్లో వేసే ఈ ఆకు చాలా ప్రయోజనాలు ఇస్తుంది. కూరల్లో కలిపినా, చట్నీగా తీసుకున్నా శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కొంతమంది కొత్తిమీర జ్యూస్ కూడా తాగుతారు. ఇది కూడా మంచి ఆప్షన్. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో కలిసి తీసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
చివరగా పుదీనా గురించి చెప్పాలి. వేసవిలో ఇది చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. పుదీనా చట్నీ, పుదీనా నీరు, బటర్‌మిల్క్‌లో కలిపి తాగినా శరీరం వెంటనే కూల్‌గా ఫీల్ అవుతుంది. తాగిన వెంటనే తేజస్సు పెరిగినట్టు అనిపిస్తుంది. అందుకే వేసవిలో చాలా ఇళ్లలో పుదీనా ఎక్కువగా వాడతారు.

ఎండల సమయంలో మనం తినే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే ఎక్కువ మసాలా, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గిస్తే మంచిది. తేలికగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరం మీద ఒత్తిడి తగ్గుతుంది. ఈ సింపుల్ ఫుడ్స్ డైలీ డైట్‌లో చేర్చితే ఎండల వేడి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×