BigTV English
Advertisement

Beetroot for Intercourse: బీట్ రూట్ తినండి బాబాయ్‌లూ.. ఆ సమస్యలన్నీ హాంఫట్!

Beetroot for Intercourse: బీట్ రూట్ తినండి బాబాయ్‌లూ.. ఆ సమస్యలన్నీ హాంఫట్!

Beetroot Benefits: బీట్ రూట్ లో బోలెడు పోషకాలుంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, డైటరీ పైబర్ సమృద్ధిగా ఉంటుంది. తాజాగా నిర్వహించిన పరిశోధనలో బీట్ రూట్ స్త్రీ, పురుషులలో లైంగిక ఆసక్తిని పెంచుతున్నట్లు తేలింది. పడక గదిలో శృంగారాన్ని ఎంజాయ్ చేయలేని వాళ్లు, రెగ్యులర్ గా బీట్ రూట్ తీసుకోవడం వల్ల చక్కటి లైంగిక సంతోషాన్ని పొందే అవకాశం ఉందంటున్నారు. బీట్ రూట్ లైంగిక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రక్త ప్రసరణను వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యగా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.


బీట్ రూట్ లైంగిక సామర్థ్యాన్ని ఎలా పెంచుతుంది?

1.నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి


బీట్‌ రూట్‌ లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ లైంగిక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.

2.ఎనర్జీ

బీట్‌రూట్‌లో బీటైన్,  బోరాన్ ఉంటుంది. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. మెరుగైన లైంగిక పనితీరుకు సాయపడుతుంది.

3.హార్మోన్ల ఉత్పత్తి   

బీట్‌రూట్‌లోని బోరాన్ స్త్రీ, పురుషులలో ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ లాంటి  లైంగిక హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే 5 బీట్ రూట్ వంటకాలు

లైంగిక శక్తిని పెరిగేందుకు బీట్ రూట్ ను ఎలా ఉపయోగించాలో నిఫుణులు కీలక సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1.బీట్‌ రూట్ జ్యూస్

రోజూ ఒక గ్లాసు తాజా బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.  రెండు పెద్ద బీట్ రూట్ లు, ఒక ఆపిల్, ఒక క్యారెట్ తీసుకుని వాటి ముక్కులుగా కట్ చేసి కప్పు నీళ్లు కలిపి  మిక్స్ చేయాలి. రసాన్ని వడకట్టి తాగడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

2.బీట్ రూట్ సలాడ్

బీట్‌ రూట్‌ ను ఆకు కూరలు, గింజలతో కలిపి సలాడ్ గా మార్చి తీసుకోవడం వల్ల రుచితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.  రెండు బీట్ రూట్ లు, ఒక కప్పుడు బచ్చలికూర ఆకులు, కప్పు బాదం, చీజ్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, తేనె కలిపి సలాడ్ గా తీసుకోవడం వల్ల లైంగిక ఆరోగ్యం పెరుగుతుంది.

3.బీట్‌రూట్ స్మూతీ

లైంగిక ఆరోగ్యానికి తోడ్పడే రిఫ్రెష్ స్మూతీ కోసం బీట్‌ రూట్‌ ను యాపిల్స్, బెర్రీలు, అల్లం తో కలిపి తీసుకోవాలి. ఉడికించిన బీట్ రూట్, ఆపిల్, కప్పు బెర్రీలు, కాస్త అల్లం ముక్క, కప్పు నీరు కలిపి మిక్స్ చేసి తాగడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది.

4.కాల్చిన బీట్‌రూట్

బీట్ రూట్ ను ఆలివ్ ఆయిల్ మసాలా కలిపి కాల్చిన డిష్ తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. రెండు బీట్ రూట్ లు, కాస్త ఆలివ్ ఆయిల్, కాస్త ఉప్పు, మిరియాలు తీసుకుని ఉడికించాలి. దానికి కాస్త చీజ్ కలిపి తినడం వల్ల రుచితో పాటు లైంగిక శక్తి పెరుగుతుంది.

5.బీట్‌ రూట్ సూప్

రోజ్మేరీ, మూలికలతో బీట్‌ రూట్ సూప్‌ తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి లైంగిక సంతోషాన్ని పొందవచ్చు. శరీరానికి పోషణ ఇవ్వడంతో పాటు లైంగిక శక్తిని పెంచుతుంది. బీట్ రూట్, ఉల్లిపాయలు, క్యారెట్, లవంగాలు, ఆలివ్ ఆయిల్, వాటర్ కలిసి సూప్ గా తయారు చేసి తాగడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది.

కిడ్నీ స్టోన్స్,  జీర్ణ సమస్యలు, అలెర్జీ సమస్యలు ఉన్నవాళ్లు బీట్ రూట్ ను పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Read Also: కల్తీ ఆహారాన్ని గుర్తించేది ఎలా? తేనె నుంచి మాంసం వరకు.. ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి

Related News

Banana Hair Mask: అరటి పండుతో హెయిర్ మాస్క్.. ఇలా వాడితే సిల్కీ హెయిర్

Gold Cleaning Tips: బంగారు ఆభరణాలు నల్లగా మారాయా? ఇలా ఇంట్లోనే సింపుల్‌గా తళతళలాడించేయండి

Pomegranates: వీళ్లు.. దానిమ్మ అస్సలు తినకూడదు తెలుసా ?

Rava Pulihora: ఒక్కసారి రవ్వ పులిహోర ఇలా చేసి చూడండి, వదలకుండా తినేస్తారు

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Big Stories

×