BigTV English

Instagram : ఇన్​స్టాలో సరికొత్త ఫీచర్​ – సింగిల్ ట్యాప్​లో నచ్చిన సాంగ్​తో చిల్​!

Instagram : ఇన్​స్టాలో సరికొత్త ఫీచర్​ – సింగిల్ ట్యాప్​లో నచ్చిన సాంగ్​తో చిల్​!

Instagram : ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ మరో కొత్త సదుపాయాన్ని తన వినియోగదారులకు కల్పించింది. ముఖ్యంగా మ్యూజిక్, సాంగ్​​ లవర్స్​కు ఉపయోగపడేలా తాజాగా స్పాటిఫైతో జత కట్టింది. ఈ రెండిటి భాగస్వామ్యంతో ఇన్ స్టా గ్రామ్​లో యూజర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పపుడీ ఈ ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది.


ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇన్ స్టా యూజర్స్​ తమ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్​లు లేదా స్టోరీల నుంచి సాంగ్స్​ను లేదా మ్యూజిక్ క్లిప్​ లేదా మ్యూజిక్​ను డైరెక్ట్​గా స్పాటిఫై ప్లే జాబితాకు సింగిల్​​ ట్యాప్​లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే స్పాటి ఫైలో సేవ్ చేసుకోవచ్చు. అలాగే, స్పాటిఫై ప్లే లిస్ట్​లోని పాటలను ఇన్ స్టా స్టోరీలకు యాడ్ చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్, స్పాటిఫై వినియోగదారులకు మరింత ఇంటరాక్టివ్ అనుభవం అందించడమే లక్ష్యంగా ఈ ఫీచర్​ను తీసుకొచ్చారు.

ముందుగా అప్డేట్​ చేయాలి – ఈ కొత్త ఫీచర్​ను ఉపయోగించాలంటే ఇన్​ స్టాగ్రామ్​, స్పాటి ఫై యూజర్లు ముందుగా తమ స్మార్ట్ ఫోన్స్​లోని ఈ రెండు యాప్స్​ను తాజా వెర్షన్​లోకి అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు ఇన్ స్టాగ్రామ్ యూజర్స్ సాంగ్స్​ను​ నేరుగా స్పాటిఫై ట్రాక్స్, ఆల్బమ్స్, లైక్డ్​ సాంగ్స్​ లేదా ప్లే లిస్ట్ లైబ్రరీలో ఎంచక్కా సేవ్ చేసుకోవచ్చు.


ALSO READ : హ్యాకర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే యూట్యూబ్ కొత్త టూల్.. ఒక్క క్లిక్ తో అకౌంట్ సేఫ్

ఉదాహరణకు ఇన్​స్టా పోస్ట్​లను స్క్రోల్ చేస్తూ చూసేటప్పుడు లేదా ఇన్ ​స్టా స్టోరీస్​లో ఏదైనా పాట నచ్చితే, దాన్ని స్పాటిఫైలో ప్రత్యేకంగా ​ సెర్చ్ చేయకుండా, సింపుల్​గా ఆ స్టోరీలో ఇంటిగ్రేట్ అయి ఉన్న ‘ప్లే లిస్ట్​కు జోడించు’ బటన్ పై క్లిక్ చేస్తే చాలు. ఆ సాంగ్​ తమ స్పాటిఫై ప్లే లిస్ట్ లో యాడ్ అవుతుంది. ఇంకా ఆ సాంగ్​ను ప్లే లిస్ట్​కు యాడ్ చేసే ముందు వినియోగదారులు ఆ ట్రాక్​ను ప్రివ్యూ చేసే వీలు కూడా ఉంటుంది.

ఇన్ స్టా గ్రామ్​కు స్పాటిఫైని ఎలా కనెక్ట్ చేయాలంటే? – ఈ కొత్త సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే, యూజర్స్​ ముందుగా తమ స్పాటిఫై ఖాతాను ఇన్ స్టాగ్రామ్​కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 1 – ముందుగా ఇన్​ స్టాగ్రామ్​లో నచ్చిన పోస్ట్​లోని సాంగ్​ను ట్యాప్ చేయాలి.
స్టెప్​ 2 – టాప్​లో ఉన్న స్పాటి ఫై బట్​న్​కు ట్యాప్ చేసిన దాన్ని యాడ్​ చేయాలి.
స్టెప్​ 3 – అప్పుడు మీ అకౌంట్​ను స్పాటి ఫైతో లింక్​ చేయమా అని ఇన్ ​స్టా అడుగుతుంది. అప్పుడు స్పాటి ఫై బటన్ లింక్​ను ట్యాప్ చేయాలి.
స్టెప్ 4 – కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి.
స్టెప్ 5 – అప్పుడు స్పాటి ఫై మెయిల్, పాస్​వర్డ్​ను యాడ్ చేయాలి. లేదంటే గూగుల్​, ఫేస్​బుక్​, యాపిల్ అకౌంట్​తో లాగిన్ అవ్వాలి.
స్టెప్ 6 – అప్పుడు ప్రాసెస్​ పూర్తి అవుతుంది.
ఫైనల్​గా ఈ కొత్త సదుపాయం ఐఓఎస్ , అండ్రాయిడ్​ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

 

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×