E-Paper
Advertisement

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌తో ఆరోగ్యానికి ముప్పు.. ఇంతకీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌తో ఆరోగ్యానికి ముప్పు.. ఇంతకీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
Advertisement

Belly Fat: శరీరంలో కొవ్వు పేరుకుపోవడం అనేది సహజం అయినప్పటికీ.. కొవ్వు ఎక్కడ పేరుకుపోతుంది అనే దానిపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ.. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వు దీర్ఘకాలిక వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు దారితీసే అత్యంత ప్రమాదకరమైన కొవ్వు రకంగా చెబుతారు. ఈ బెల్లీ ఫ్యాట్‌ను విసెరల్ ఫ్యాట్ అని కూడా అంటారు. ఇది చర్మానికి కింద కాకుండా. కాలేయం, క్లోమం, పేగులు వంటి ముఖ్యమైన అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోతుంది.

బెల్లీ ఫ్యాట్ ఆరోగ్యానికి ముప్పు ఎందుకు?
విసెరల్ ఫ్యాట్ చురుకైన జీవక్రియ కణంగ పనిచేస్తుంది. ఇది శరీరంలో అనేక హానికరమైన పదార్థాలను, ముఖ్యంగా సైటోకైన్స్ అనే ఇన్ఫ్లమేటరీ రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ రసాయనాలు కణజాలం, అవయవాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి, శరీరమంతా నిరంతరంగా తక్కువ-స్థాయి ఇన్ఫ్లమేషన్‌ ను పెంచుతాయి. ఈ ఇన్ఫ్లమేషన్ క్రమంగా కింది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది:

Advertisement

గుండె జబ్బులు, స్ట్రోక్ :

బెల్లీ ఫ్యాట్ రక్తపోటును పెంచుతుంది.

Advertisement

హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

ఇది ధమనుల గట్టిపడటానికి దోహదపడుతుంది. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

టైప్ 2 మధుమేహం:

విసెరల్ ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచుతుంది. దీని వల్ల కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించవు.

ఫలితంగా.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అవుతుంది.

ఫ్యాటీ లివర్:

అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు, కాలేయం పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏర్పడుతుంది. ఇది కాలేయ వైఫల్యానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.

క్యాన్సర్ ప్రమాదం:

ఎక్కువ మొత్తంలో బెల్లీ ఫ్యాట్ ఉన్నవారిలో పెద్దపగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ , క్లోమ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిద్రలో శ్వాస ఆడకపోవడం:

పొత్తి కడుపులోని కొవ్వు ఛాతీపై ఒత్తిడిని పెంచడం ద్వారా నిద్రలో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇది స్లీప్ అప్నియాకు కారణమవుతుంది.

మెదడు ఆరోగ్యం :

కొన్ని పరిశోధనల ప్రకారం.. బెల్లీ ఫ్యాట్ అధికంగా ఉండటం వల్ల వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్, డిమెన్షియావంటి నరాల సంబంధిత సమస్యల ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

Related News

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

Big Stories

Advertisement
×