E-Paper
Advertisement

వేసవిలో పిల్లల ఇమ్యూనిటీ కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. మీ పిల్లల డైట్‌లో ఉన్నాయా?

వేసవిలో పిల్లల ఇమ్యూనిటీ కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. మీ పిల్లల డైట్‌లో ఉన్నాయా?
Advertisement

Immunity Boosting Foods For Children: ఎండలు మండిపోతున్న వేసవిలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో.. బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పిల్లల ‘ఇమ్యూనిటీ’ బలంగా ఉండటం అత్యవసరం. కేవలం ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్‌తో దాహం తీర్చుకోవడం కాకుండా.. శరీరానికి పోషణ నిచ్చే సహజ సిద్ధమైన ఆహారాలను అందించాలి. విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు పిల్లలను అంతర్గతంగా దృఢంగా మారుస్తాయి. ఈ వేసవిలో మీ పిల్లల డైట్‌లో చేర్చాల్సిన ఉత్తమ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల లిస్ట్,  వాటి ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

వేసవి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు:
వేసవిలో పిల్లల శరీరాన్ని చల్లబరుస్తూనే.. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే..

Advertisement

1. పుచ్చకాయ:
పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన హైడ్రేషన్‌ను ఇవ్వడమే కాకుండా.. విటమిన్ ఏ , సిలను అందిస్తుంది. ఇది రోగ నిరోధక కణాలను ఉత్తేజపరుస్తుంది.

2. పెరుగు :
పెరుగులో ఉండే ‘ప్రోబయోటిక్స్'(మంచి బ్యాక్టీరియా) జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. కడుపు ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Advertisement

3. నిమ్మరసం:
విటమిన్ సి నిల్వలు పుష్కలంగా ఉండే నిమ్మకాయ, తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

4. కొబ్బరి నీళ్లు:
ఇందులో ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గించి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

5. మామిడి పండ్లు:
ఫలరాజు మామిడిలో విటమిన్ ఏ, సి , క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధులతో పోరాడటానికి సహాయ పడతాయి.

6. బొప్పాయి:
బొప్పాయిలో ‘పాపైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియకు మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

7. నారింజ :
నారింజలో ఉండే ఫైబర్, విటమిన్ సి కణాల నష్టాన్ని నివారించి.. వ్యాధి నిరోధకతను పెంచుతాయి.

8. బెర్రీలు :
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలలో ఉండే ‘ఫ్లేవనాయిడ్స్’ పిల్లల మెదడు చురుగ్గా ఉండటానికి ,ఇమ్యూనిటీకి మేలు చేస్తాయి.

9.బాదం:
బాదంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి జలుబు, దగ్గు వంటి సమస్యలను దరిచేరనివ్వదు.

10. గుడ్లు :
గుడ్లలో ఉండే విటమిన్ డి , ప్రొటీన్లు కండరాల పుష్టిని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

11. చిలగడదుంప :
ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏగా మారి చర్మం , ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

12. అల్లం :
వేసవిలో వచ్చే గొంతు నొప్పి లేదా అజీర్తి సమస్యలకు అల్లం అద్భుతంగా పని చేస్తుంది. దీనిని రసం రూపంలో లేదా ఆహారంలో కలిపి ఇవ్వవచ్చు.

13. వెల్లుల్లి :
వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ వ్యాధికారక క్రిములను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది.

Also Read: అరుదుగా దొరికే పచ్చి బాదం.. దీని వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలిస్తే వదలరు!

14. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ :
పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలేట్, ఐరన్ , విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతాయి.

15. పసుపు :
పసుపులోని ‘కర్కుమిన్’ యాంటీ సెప్టిక్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పని చేస్తుంది. రాత్రి పూట పాలలో పసుపు కలిపి ఇస్తే పిల్లలకు చాలా మంచిది.

16. దోసకాయ :
శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి , శరీరాన్ని చల్లగా ఉంచడానికి దోసకాయ ఎంతగానో.. ఉపయోగపడుతుంది.

17. సీడ్స్ :
గుమ్మడి గింజలు, చియా సీడ్స్‌లో జింక్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పిల్లల శారీరక ఎదుగుదలకు.. రోగనిరోధక శక్తికి కీలకం.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×