BigTV English

Oil For Hair Growth: జుట్టు ఎక్కువగా రాలుతుందా.. ఈ నూనె రాస్తే.. మీ జుట్టు వద్దన్నాపెరుగుతుంది

Oil For Hair Growth: జుట్టు ఎక్కువగా రాలుతుందా.. ఈ నూనె రాస్తే.. మీ జుట్టు వద్దన్నాపెరుగుతుంది

Best Hair Oil For Hair Growth and Thickness: జీవన శైలి మారింది.. ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టురాలే సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు ఒత్తుగా పెరగటానికి మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఫలితం మాత్రం ఉండదు. పూర్వం అమ్మ, అమ్మమ్మ, రోజూ మనకి హెయిర్ కు నూనె రాసేవారు. దీని వల్ల జుట్టుకు ఖచ్చితంగా పోషణ లభిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా.. దృఢంగా మారుతుంది. అయితే ఈ రోజుల్లో డ్రై హెయిర్ ట్రెండ్ లో ఉండటం వల్లన జుట్టుకు ఆయిల్ పెట్టుకోవడమే మానేసారు. దీని కారణంగా జుట్టులో పోషకాహార లోపం క్షీణిస్తుంది. అంతేకాకుండా జుట్టు పొడవును కూడా ప్రభావితం చేస్తుంది. మీకు పొడవాటి జుట్టు కావాలంటే ఈ నూనెలు వాడండి మంచి ఫలితం ఉంటుంది.


కొబ్బరి నూనె– మీకు పొడవాటి, ఒత్తుగా ఉండే జుట్టు కావాలంటే కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. దీంతో జుట్టు ఒత్తుగా, పొడవుగా, దృఢంగా తయారవుతుంది. కొబ్బరి నూనెలో అనేక రకాల విటమిన్స్ ఉన్నాయి. కొబ్బరి నూనెను వారానికి కనీసం 2-3 సార్లు ఉపయోగించండి. 2 చెంచాల కొబ్బరి నూనెను తీసుకుని తలపై జుట్టు మూలాలపై బాగా మసాజ్ చేయండి. ఇది జుట్టుకు తేమను అందిస్తుంది. కొబ్బరి నూనె పొడి జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.

బృంగరాజ్ నూనె – బ్రింగరాజ్ నూనె కూడా మందపాటి జుట్టుకు ఉపయోగపడుతుంది. జుట్టు పొడవును పెంచే భృంగరాజ్ నూనెలో అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉన్నాయి. వెంట్రుకలను ఒత్తుగా మార్చేందుకు ఈ నూనె శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. బృంగరాజ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు  పొడవు పెరుగుతుంది అలాగే ఒత్తుగా మారుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా ఆక్సిజన్ అందిస్తుంది. దీని వల్ల జుట్టు బలంగా, ఆరోగ్యంగా మారుతుంది.


Also Read: ఈ ఒక్క ఆయుర్వేద మూలిక ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా..

షికాకాయ్ ఆయిల్ – షికాకాయ్ నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా మారుతుంది. ఇది సహజమైన క్లెన్సర్, కండీషనర్, డిటాంగ్లర్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఇది చుండ్రును నివారించడంలో కూడా సహాయపడుతుంది. షికాకాయ్ లో సపోనిన్‌లు ఉన్నాయి. ఇవి తలపై ఉండే మురికి, నూనె తొలగిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి ఇ జుట్టుకు పూర్తి పోషణను అందిస్తాయి.

Related News

Stress And Heart attack: స్ట్రెస్ ఎక్కువైతే.. హర్ట్ ఎటాక్ వస్తుందా ?

Health Benefits: ఈ ఒక్క చపాతీ తింటే చాటు.. ఆ సమస్యలన్నీ మాయం

Magnesium Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? జాగ్రత్త

Healthy Looking Skin: ఆరోగ్యవంతమైన చర్మం కోసం.. ఎలాంటి చిట్కాలు పాటించాలి ?

Sleep: తగినంత నిద్ర ఎందుకు ముఖ్యమంటే ?

Drink For Hair Fall: ఈ డ్రింక్స్‌తో.. హెయిర్ ఫాల్‌కు చెక్

Big Stories

×