E-Paper
Advertisement

Jewellery shop robbery In America: అమెరికాలో దారుణం, ఇండియన్ జ్యువెలరీ షాపు లూటీ

Jewellery shop robbery In America: అమెరికాలో దారుణం, ఇండియన్ జ్యువెలరీ షాపు లూటీ
Advertisement

Jewellery shop robbery In America: అమెరికాలో దారుణం జరిగింది. ముఖ్యంగా అక్కడ భారతీయుల బంగారం షాపులను టార్గెట్ చేశారు పని పాటా లేని కొంతమంది దుండగులు. షాపుల్లో దొరికిన బంగారం ఎత్తుకుపోవడం వాళ్ల వంతైంది.

తాజాగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో‌ సిటీకి దగ్గరలోని బే ఏరియాలో ఇండియన్‌కు చెందిన పీఎన్జీ బంగారం షాపు లూటీ జరిగింది. దాదాపు 20 మంది వ్యక్తులు రెండుమూడు వాహనాల్లో సుత్తులు, గొడ్డలి పట్టుకొని వచ్చారు. అద్దాలను పగలగొట్టి షాపులోకి ఎంట్రీ ఇచ్చారు. అందులోని ఉన్న బంగారం ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో జరిగింది.

Advertisement

పట్టపగలు జరిగిన ఈ ఘటనలో నిందితులంతా బ్లాక్ కలర్ దుస్తులు ధరించారు. సీసీటీవీ కెమెరాలు గుర్తు పట్టలేనంతా ముఖాలకు మాస్క్‌లు ధరించారు. తమతో తెచ్చుకున్న సుత్తులతో అద్దాలను పగల గొట్టి లోపల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్లను చూసి బెంబేలెత్తిపోయాడు. బంగారాన్ని తెచ్చుకున్న సంచుల్లో పెట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

ALSO READ: ఈవీఎంలపై ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

ఈ విషయం తెలియగానే వాళ్లను వెంబడించే ప్రయత్నం చేశారు స్థానిక పోలీసులు. అందులో ఐదుగుర్ని మాత్రమే అరెస్ట్ చేశారు. ఎంత బంగారాన్ని దోచుకెల్లారనేది సీక్రెట్‌గా ఉంచారు అధికారులు. రెండు లేదా మూడు వాహనాల్లో వీరంతా వచ్చినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.

పూణె కేంద్రంగా పీఎన్జీ బంగారం షాపు 19వ సెంచరీలో ప్రారంభమైంది. వ్యవస్థాపకులు గణేష్ గాడ్జిల్ ఈ వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించారు. దేశవ్యాప్తంగా వందలాది షాపులున్నాయి. ఇండియా, దుబాయ్, అమెరికాలో ఈ కంపెనీకి గోల్డ్ షాపులున్నాయి. గడిచిన రెండు మూడేళ్ల నుంచి భారతీయుల బంగారం షాపులపై దుండగలు కన్నేయడంతో ఇండియన్ అమెరికన్ బిజినెస్ లీడర్స్ సిటీ మేయర్‌తో భేటీ అయ్యారు. ఇలాగైతే తాము వ్యాపారాలు చేయలేమని తేల్చి చెప్పేశారు.

2022-2023 వరకు జనవరి చివరి వరకు తొమ్మిది జ్యువెల్లరీ షాపులు రోబరీ అయ్యాయి. వాటిలో న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా, ఫ్లోరిడా, శాన్‌ఫ్రాన్సిస్కో రాష్ట్రాలున్నాయి. వీటిలో చాలావరకు భారతీయులకు చెందిన షాపులున్నాయి.

 

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×