E-Paper
Advertisement

Vitamin D: విటమిన్-డి ట్యాబ్లెట్లు వాడుతున్నారా ? అయితే ఈ తప్పులు చేయకండి!

Vitamin D: విటమిన్-డి ట్యాబ్లెట్లు వాడుతున్నారా ? అయితే ఈ తప్పులు చేయకండి!
Advertisement

Vitamin D: నేటి కాలంలో విటమిన్-డి లోపం ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. ఎముకల బలం, రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ఈ విటమిన్ అత్యవసరం. అయితే.. చాలా మంది విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకుంటున్నప్పటికీ.. సరైన ఫలితాలు పొందలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం దాన్ని తీసుకునే విధానం, సమయం తెలియకపోవడమే. విటమిన్-డి అనేది కొవ్వులో కరిగే విటమిన్, కాబట్టి దీనిని ఖాళీ కడుపుతో కాకుండా సరైన ఆహారంతో కలిపి తీసుకున్నప్పుడే శరీరం గ్రహించగలుగుతుంది. విటమిన్-డి తీసుకోవడానికి సరైన సమయం, పద్ధతుల గురించి తెలుసుకుందాం.

విటమిన్-డి ఎందుకు ముఖ్యం ?

Advertisement

విటమిన్-డి అనేది కేవలం ఒక విటమిన్ మాత్రమే కాదు. ఇది శరీరంలో ఒక హార్మోన్‌లా పనిచేస్తుంది. మన శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్-డి తప్పనిసరి. ఇది లేకపోతే ఎముకలు బలహీనపడటం, కండరాల నొప్పులు, అలసట, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. సూర్యరశ్మి ద్వారా ఇది సహజంగా లభించినప్పటికీ.. మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు.

విటమిన్-డి తీసుకోవడానికి సరైన సమయం ఏది?
విటమిన్-డి తీసుకోవడానికి ‘ఉదయం లేదా మధ్యాహ్నం’ అత్యంత అనుకూలమైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ సమయంలో: విటమిన్-డి ని రోజులో అతిపెద్ద భోజనంతో పాటు తీసుకోవడం వల్ల దాని శోషణ 50 శాంతి వరకు పెరుగుతుంది.

రాత్రిపూట ఎందుకు వద్దు ?:
కొంతమంది రాత్రిపూట విటమిన్-డి తీసుకుంటారు, కానీ ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. విటమిన్-డి శరీరంలో ‘మెలటోనిన్’ (నిద్రను కలిగించే హార్మోన్) ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీని వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చు.

కొవ్వు పదార్థాలతో కలిపి తీసుకోవడం తప్పనిసరి:
విటమిన్-డి అనేది ‘ఫ్యాట్ సొల్యూబుల్’ విటమిన్. అంటే ఇది నూనె లేదా కొవ్వు ఉన్నప్పుడే కరుగుతుంది. మీరు కేవలం నీళ్లతో విటమిన్-డి ట్యాబ్లెట్ వేసుకుంటే అది శరీరానికి పూర్తిగా అందదు.

ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలు: నెయ్యి, పెరుగు, గుడ్లు, బాదం, అవకాడో లేదా ఆలివ్ ఆయిల్ వంటి వాటితో కలిపి తీసుకోవడం వల్ల విటమిన్-డి రక్తంలో త్వరగా కలుస్తుంది.

Also Read:ఏఐ స్టెతస్కోప్‌తో గుండె జబ్బులను ముందే పసిగట్టవచ్చు తెలుసా ?

సూర్యరశ్మి – సహజ వనరు:
ట్యాబ్లెట్ల కంటే సూర్యరశ్మి ద్వారా వచ్చే విటమిన్-డి ఎప్పుడూ శ్రేష్ఠం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య కనీసం 15-20 నిమిషాల పాటు ఎండలో ఉండటం వల్ల శరీరం తగినంత విటమిన్-డి ని తయారు చేసుకుంటుంది.

అతిగా తీసుకోవద్దు:
విటమిన్-డి మంచిదే కదా అని మోతాదుకు మించి తీసుకోకూడదు. రక్తంలో విటమిన్-డి స్థాయిలు మరీ ఎక్కువగా ఉంటే , అది కిడ్నీలో రాళ్లు, గుండె సమస్యలకు దారితీయవచ్చు. అందుకే డాక్టర్ సలహా మేరకు నెలకు ఒకసారి లేదా వారానికి ఒకసారి తీసుకునే డోసేజ్ పాటించాలి.

విటమిన్-డి ని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల శారీరక శక్తి పెరగడమే కాకుండా.. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఎప్పుడూ ఆరోగ్యకరమైన కొవ్వు ఉన్న ఆహారంతో పాటు.. ఉదయం పూట దీనిని తీసుకోవడం అలవాటు చేసుకోండి.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×