E-Paper
Advertisement

AK47 Movie: త్రివిక్రంకు కోపం తెప్పించిన ‘ఏకే 47’ సినిమాటొగ్రఫర్.. ఏం చేశారంటే?

AK47 Movie: త్రివిక్రంకు కోపం తెప్పించిన ‘ఏకే 47’ సినిమాటొగ్రఫర్.. ఏం చేశారంటే?
Advertisement

AK47 Movie: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. వీరిద్దరి కలయికలో రాబోతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎకె47’ (AK47) గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా టెక్నికల్ టీమ్‌లో కీలక మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సాను వర్గీస్‌ను అనుకున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆయన స్థానంలోకి దిగ్గజ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ వచ్చి చేరారు.

Read also-Ram Charan: ‘పెద్ది’ దర్శకుడు బుచ్చి బాబుకు స్పెషల్ విషెస్ చెబుతూ రామ్ చరణ్ ఎమోషనల్..

మార్పుకు కారణమేంటి?

Advertisement

సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల కోసం ఒక పక్కా ప్లానింగ్‌తో ఉంటారు. సాను వర్గీస్ ప్రతిభావంతుడైన కెమెరామెన్ అయినప్పటికీ, ఈ సినిమాకు కావాల్సిన విజువల్ లాంగ్వేజ్ విషయంలో లేదా వర్కింగ్ స్టైల్ విషయంలో ఎక్కడో చిన్న ‘మిస్ మ్యాచ్’ జరిగినట్లు సమాచారం. మేకర్స్‌కు, సాను వర్గీస్‌కు మధ్య క్రియేటివ్ అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని వినికిడి. వెంకటేష్‌ను సరికొత్త మాస్ లుక్‌లో చూపించాలనే త్రివిక్రమ్ విజన్‌కు, రవి కె. చంద్రన్ అయితేనే కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తోంది.

Read also-Chatha Pacha OTT: విడుదలైన వారంలోపే ఓటీటీలోకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పెరిగిన అంచనాలు

Advertisement

రవి కె. చంద్రన్ ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించారు. త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే ఆ ‘గ్లేజ్’, ‘రిచ్‌నెస్’ తీసుకురావడంలో రవి కె. చంద్రన్ సిద్ధహస్తుడు. ‘ఎకె47’ పేరులోనే పవర్ ఉంది. కాబట్టి ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను వెండితెరపై గ్రాండ్‌గా ఆవిష్కరించడానికి ఆయన ఎంట్రీ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ ఒక పక్కా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో కనిపిస్తుండటం విశేషం. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. త్వరలోనే ఈ టెక్నికల్ మార్పుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, ‘ఎకె47’ కోసం త్రివిక్రమ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నారు. రవి కె. చంద్రన్ కెమెరా పనితనం వెంకీ మామ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.

Related News

రణబాలికి పోటీగా ఆదర్శ కుటుంబం… గెలుపెవరిదో!

మిల్కీ బ్యూటీకి పడిపోయాడా?.. స్టేజ్‌పైనే హీరో చేసిన పని వైరల్

నాని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..మళ్ళీ వాయిదా దిశగా ప్యారడైజ్!

ఇరుముడి ఊపు తగ్గలేదుగా…మరో రికార్డుపై కన్నేసిన రవితేజ !

కోర్ట్ హీరో రోషన్ ‘తెల్ల కాగితం’ టీజర్ రిలీజ్!

శ్రీలీల చిన్నప్పటి ‘భరతనాట్యం’ వీడియో చూశారా? ఏం టాలెంట్ గురూ!

చిక్కుల్లో పడ్డ హీరో కార్తీ.. స్టార్ హీరోయిన్ వస్త్రధారణపై కామెంట్స్!

వారణాసి చిత్రంపై అదిరిపోయే న్యూస్.. బుల్ ఫైట్ షూటింగ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×