E-Paper
Advertisement

Bhogi Wishes 2026: భోగి సందర్భంగా.. మీ ఆత్మీయులకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పండిలా !

Bhogi Wishes 2026: భోగి సందర్భంగా.. మీ ఆత్మీయులకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పండిలా !
Advertisement

Bhogi Wishes 2026: సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజైన భోగి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. పాత సామాగ్రిని, ప్రతికూల ఆలోచనలను మంటల్లో వేసి, కొత్త వెలుగులతో జీవితాన్ని ప్రారంభించడమే ఈ పండగ పరమార్థం. ఈ రోజు తెల్లవారుజామున వేసే భోగి మంటలు, రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు , పిల్లలపై పోసే భోగి పళ్లు ఇంటింటా కోలాహలాన్ని నింపుతాయి. ఈ శుభ సందర్భంగా మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.

భోగి శుభాకంక్షలు: 

Advertisement

1. ఈ భోగి మంటలు మీ జీవితంలోని కష్టాలన్నింటినీ దహించివేయాలని కోరుకుంటూ.. హ్యాపీ భోగి !

2. భోగి పండగ తెచ్చే కొత్త వెలుగులు మీ ఇంట్లో సిరిసంపదలను నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.

Advertisement

3. ఈ భోగి మంటల సాక్షిగా మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ భోగి !

4. చెడు పోయి మంచి కలగాలని, మీ జీవితం సుఖసంతోషాలతో నిండాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు.

5.కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలి. కొత్త ఆనందాలు సంతోషాలు వెల్లివిరియాలి.మీ అందరికీ భోగి శుభాకాంక్షలు.

6.ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ హ్యాపీ భోగి

7. ఈ భోగి మీ జీవితంలో భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ భోగి

8. భాగ్యాలనిచ్చే భోగి సరదాలనిచ్చేసంక్రాంతి కమ్మదనం పంచే కనుమ, ఈ సంబరం నింపాలి మీ ఇంట్లో సిరుల పంట.. అందరికంటే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.

9.ఈ భోగి మంటలు మీ జీవితంలోని పాత చేదు జ్ఞాపకాలను, ప్రతికూల ఆలోచనలను దహించివేయాలి. కొత్త ఉత్సాహంతో, సరికొత్త ఆశలతో మీ ప్రయాణం సుఖమయంగా సాగాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.

10. భోగి మంటల వెచ్చదనం మీ ఇంట్లో సంతోషాన్ని నింపాలి. ముంగిట వేసిన రంగుల ముగ్గుల లాగా మీ జీవితం కూడా వైవిధ్యమైన విజయాలతో మెరవాలి. భోగభాగ్యాలనిచ్చే ఈ పండగ మీ అందరికీ శుభం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ భోగి

11. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్లుగా.. మీ కష్టాలన్నీ తొలిగిపోయి సుఖ శాంతులు చేకూరాలి. భోగి పళ్ల దీవెనలు మీ పిల్లలపై సదా ఉండాలని, మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారాలని కోరుకుంటూ హ్యాపీ భోగి 2026!

12. గొబ్బెమ్మల అందం, గాలిపటాల జోరు, భోగి మంటల హోరు.. మన తెలుగు సంప్రదాయానికి ప్రతీకలు. ఈ పండగ మీ మనసులోని ఆశయాలకు ప్రాణం పోయాలని, మీ ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు.

13. చీకటిని చీల్చుకుంటూ వచ్చే భోగి మంటల కాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి. భోగ భాగ్యాన్ని పొందుతూ అందరితో కలిసి ఆనందంగా ఈ పండగను జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబానికి భోగి శుభాకాంక్షలు.

14. రేపటి సంక్రాంతి సంబరానికి స్వాగతం పలుకుతూ, పాత సామాగ్రిని మంటల్లో వేసి ప్రకృతిని గౌరవిద్దాం. ఈ భోగి పండగ మీ కుటుంబంలో ఐక్యతను, అనురాగాన్ని పెంచాలని, అష్టైశ్వర్యాలు చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను. భోగి పండగ శుభాకాంక్షలు.

15. భోగి మంటల సాక్షిగా మీలో ఉన్న ప్రతికూలత అంతం కావాలి. సూర్యభగవానుడి అనుగ్రహంతో మీ ఆరోగ్యము, ఐశ్వర్యము వృద్ధి చెందాలి. ఈ పండగ వేళ మీ ఇల్లు నవ్వులతో కలకలలాడాలని కోరుకుంటూ హ్యాపీ భోగి!

16. రంగురంగుల హరిదాసు కీర్తనలు, బసవన్నల ఆశీస్సులు మీ ఇంట పండగ శోభను తీసుకురావాలి. మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని, మీ ఆత్మీయులందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు.

17.పాతను వదిలి కొత్తను స్వీకరించడమే భోగి పరమార్థం. ఈ రోజు నుంచి మీ జీవితం సరికొత్త మలుపు తిరగాలి. మీ కళ్ళలోని కలలు నిజమై, ముఖంలో చిరునవ్వు చెరగకూడదని ఆశిస్తూ.. మీకు, మీ శ్రేయోభిలాషులకు భోగి శుభాకాంక్షలు.

Also Read: భోగి రోజు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటంటే ?

18.పిండివంటల ఘుమఘుమలు, పలకరింపుల మధురిమలు ఈ భోగి పండగకు మరింత శోభను ఇస్తాయి. మీ బంధుమిత్రులతో కలిసి ఈ పండగను మరుపురాని వేడుకగా జరుపుకోవాలని, సకల శుభాలు మీకు కలగాలని కోరుకుంటూ హ్యాపీ భోగి!

19. ప్రకృతికి వందనం చేస్తూ, మట్టి వాసనను ఆస్వాదిస్తూ జరుపుకునే ఈ భోగి పండగ మీ జీవితంలో మధుర జ్ఞాపకాలను మిగిల్చాలి. ఐశ్వర్యం, సుఖం, శాంతి మీకు లభించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. మీకు భోగి శుభాకాంక్షలు.

20. గత కాలపు చేదు నిజాలను భోగి మంటల్లో వేసేద్దాం, రాబోయే తీపి వసంతానికి స్వాగతం పలుకుదాం. మీ ఆశలు, ఆశయాలు సూర్యకాంతిలా ప్రకాశించాలని ఆశిస్తూ.. మీకు, మీ ఆత్మీయులకు భోగి పండగ శుభాకాంక్షలు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×