E-Paper
Advertisement

Black Raisins Benefits: కంటి ఆరోగ్యాన్ని కాపాడే నల్లని ఎండు ద్రాక్ష.. ఆ సూపర్ బెనిఫిట్స్ ఏంటో మీరూ తెలుసుకోండి!

Black Raisins Benefits: కంటి ఆరోగ్యాన్ని కాపాడే నల్లని ఎండు ద్రాక్ష.. ఆ సూపర్ బెనిఫిట్స్ ఏంటో మీరూ తెలుసుకోండి!
Advertisement

Black Raisins Benefits: ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది చేసే మొదటి పని.. తమ ఫోన్‌‌కు వచ్చిన మెసేజులు, నోటిఫికేషన్లు, కాల్స్‌ను చెక్ చేసుకోవడం. తర్వాత హాల్లోకి వెళ్లి కాసేపు టీవీ చూడటం. ఇక తినేటప్పుడు కూడా చేతిలో ఫోన్ ఉండాల్సిందే.. ఇంటిని దాటుకుని ఆఫీసుకు చేరుకున్నాక గంటల తరబడి కంప్యూటర్‌తో కుస్తీలు పడటం. ఇదే రొటీన్ లైఫ్‌ను ప్రతిరోజూ పాటిస్తుంటారు. అయితే, మీరు చూసే మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్‌లో లైటింగ్ మీ కళ్లను ఎంతలా బాధిస్తుందో మాత్రం తెలుసుకోలేపోతున్నారు.

శాస్త్రీయ పరిష్కారం..

ప్రస్తుతం 70 శాతం మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఓ నిదేదిక తెలిపింది. అయితే ఫోన్ వాడకం, ల్యాపీ, కంప్యూటర్లో ఆఫీస్ వర్క్‌ను ఆపలేము కాబట్టి.. కనీసం మన కళ్లను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనమీద ఉంది. దీని కోసం వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. సాధారణంగా అందిరికీ అందుబాటులో ఉన్న ఎండు నల్ల ద్రాక్ష చాలని చెబుతున్నారు వైద్య నిపుణులు.

Advertisement

Also Read: కివీ పండు తొక్కలో ఇంత ఆరోగ్యం దాగుందా? వామ్మో.. ఈ విషయం తెలియక ఇన్నిరోజులూ పడేశాం కదరా!

ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కళ్లు ఎక్కువ అలసట, పొడిబారడం, ముడతలు వంటి సమస్యలకు గురవుతాయి. అలాంటి సందర్భాల్లో నల్ల ఎండు ద్రాక్షను రోజూ తీసుకుంటే.. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా.. జీర్ణక్రియను కూడా ఆరోగ్యంగాం ఉంచుతుంది.

పోషకాలు మెండు..

Advertisement

నల్ల ఎండు ద్రాక్షను డ్రై ఫ్రూట్‌గా కూడా పిలుస్తారు. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ప్రొటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు దాగున్నాయి. ముఖ్యంగా విటమిన్ ఏ మన కళ్ల రెటీనాను ఆరోగ్యంగా ఉంచి, కంటి చూపును మెరుగుపరుస్తుంది.

తినే విధానం ఇది..

కంటి ఆరోగ్యం మెరుగుపడాలన్నా, ఆల్రెడీ ఉన్న కంటి సమస్య తగ్గాలన్నా ప్రతిరోజూ రాత్రిపూట 5 నుంచి 10 బ్లాక్ కిస్మిస్‌లను నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం ఉత్తమం. పిల్లలకు పాలలో కలిపి ఇచ్చినట్లయితే కూడా సమానమైన పోషకాలు అందుతాయి. ఇలా 3 నుంచి 4 వారాలు క్రమం తప్పకుండా చేస్తే.. కళ్లు పొడిబారడం, అలసట, చిరాకు వంటి సమస్యలు తగ్గడాన్ని మీరే గమనిస్తారు.

ఇతర ప్రయోజనాలు..

నల్ల ఎండుద్రాక్షలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ కళ్లలోని రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని కారణంగా కంటి చూపు మెరుగవుతుంది. కంటి అలసట కూడా తగ్గుతుంది. ఇకపోతే బ్లాక్ కిస్మిస్ వల్ల కంటికి మాత్రమే కాదు.. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు గుండెపోటు, అధిక బీపీ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించగలవు.

Also Read: డైట్ ఫాలో అవుతున్నా బరువు తగ్గడం లేదా? రాత్రి 11 తర్వాత పడుకోవడమే కారణమంటున్న నిపుణులు!

 

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×