E-Paper
Advertisement

Benefits of Kiwi Peel: కివీ పండు తొక్కలో ఇంత ఆరోగ్యం దాగుందా? వామ్మో.. ఈ విషయం తెలియక ఇన్నిరోజులూ పడేశాం కదరా!

Benefits of Kiwi Peel: కివీ పండు తొక్కలో ఇంత ఆరోగ్యం దాగుందా? వామ్మో.. ఈ విషయం తెలియక ఇన్నిరోజులూ పడేశాం కదరా!
Advertisement

Benefits of Kiwi Peel: సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు ఏ కాలంలో అయినా తాజాగా దొరికే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని మనలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఫ్రూట్స్ మన ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే మనం తినే విధానమే ఆ పండులోని అసలు మేలును పొందగలమా లేదా అన్నది నిర్ణయిస్తుంది. అలాంటి పండ్లలో కివి ఒకటి. ఇది కాస్త ఖరీదైనదే అయినప్పటికీ.. కివీ వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలానే ఉంటాయి. ఈ పండు మన జీర్ణవ్యవస్థను బాగు చేయడం నుంచి ఇమ్యూనిటీని పెంచడంలోనూ కీలకంగా పనిచేస్తుంది.

అయితే.. ఇప్పటి వరకు మనం కివీ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రమే తెలుసుకున్నాం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పండుతో పాటు కివీ తొక్కను తినడం ద్వారా అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్‌ను పొందవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కివీ పండును శుభ్రంగా కడిగిన తర్వాత తొక్కతో పాటు పండును తినడం వలన రెట్టింపు బెనిఫిట్స్ ఉంటాయని తాజా పరిశోధనల ద్వారా వెల్లడైంది.

పోషకాల గని:

Advertisement

కివీ పండులో కంటే తొక్కలోనే కీలక పోషకాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని తరచూ తినడం వలన ఫైబర్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. తొక్కతో పాటు కివీని తింటే.. దాదాపు 30 నుంచి 50 శాతం వరకు అదనపు ఫైబర్ శరీరానికి అందుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: స్ట్రెచ్ మార్క్స్‌ను మాయం చేసే మోస్ట్ పవర్‌ఫుల్ టిప్స్.. ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు!

నిద్రలేమి సమస్యకు చెక్:

Advertisement

ముఖ్యంగా కివీ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ శరీరంలో వచ్చే వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే నిద్రలేమితో బాధపడే వారికి కివి పండు ఎంతోగానో మేలు చేస్తుంది. కివీ ఫ్రూట్‌లో సహజంగా ఉండే సెరోటోనిన్ హార్మోన్ మనస్సును ఉంచి, నాణ్యమైన నిద్రకు దోహదం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ ఒక కివీ పండును తొక్కతో కలిపి తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

గట్ హెల్త్‌కు మంచిది:

కివీ తొక్కలో ఉండే కరగని ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. అందుకే ఈ ఫ్రూట్‌ను తరచూ తీసుకుంటే.. పేగుల్లో మంచి బ్యాక్టీరియా సమతుల్యంగా పెరుగుతుంది. ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలు తగ్గడంలో కూడా కివీ సహాయకారిగా ఉంటుంది. దీంతోపాటు శీతాకాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా.. కివీలోని పోషకాలు మన శరీరానికి ఇమ్యూనిటీ బూస్ట్‌గా పనిచేస్తుంది. అలాగే కివీ తొక్క లో విటమిన్ C, ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీంతో జలుబు, దగ్గు, జ్వరం నుంచి రక్షణ పొందవచ్చు.

బరువు నియంత్రణలో:

తొక్కే కదాని తీసేస్తే.. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా కోల్పాతారని చెబుతున్నారు నిపుణులు. కివీ పండును తొక్కతో పాటు తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన భావన ఉంటుంది. దీంతో అవనసరంగా ఏదిపడితే అది తినాలి అనే ఆలోచనను తగ్గిస్తుంది. తద్వారా అధిక బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు. అలాగే కివీ తొక్కలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్లో ఉంటుంది. మధుమేహులకు కివీ పండు చాలామంచి ఔషధం.

తినే ముందు ఇలా చేయండి:

కివీ పండును తొక్కతో పాటు తినాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీరు ఎంచుకున్న ఫ్రూట్ ఎప్పుడూ ఆర్గానిక్ అయి ఉండాలి. అలాగే తినేముందు ఉప్పు లేదా బేకింగ్ సోడాతో కివి పండును శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం. ఆ తర్వాత సన్నని ముక్కలుగా కట్ చేసుకుని తినవచ్చు. అయితే, ఇప్పటికే అలెర్జీలు, నోటి మంట లేదా చికాకు వంటి సమస్యలు ఉన్నవారు తొక్కతో తినే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read: క్యాన్సర్‌ని ఎదుర్కొనే శక్తి దీనికి ఉందా? పీరియడ్స్ నొప్పులకూ బెస్ట్ సొల్యూషన్ అంటున్న నిపుణులు!

 

 

 

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×