E-Paper
Advertisement

Coconut Water: ఏడాదిలోపు పిల్లలకు కొబ్బరి నీళ్లు పెట్టవచ్చా? ఏ వయసులో కొబ్బరినీళ్లు మొదలుపెట్టాలి?

Coconut Water: ఏడాదిలోపు పిల్లలకు కొబ్బరి నీళ్లు పెట్టవచ్చా? ఏ వయసులో కొబ్బరినీళ్లు మొదలుపెట్టాలి?
Advertisement

శిశువుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ బిడ్డకు ఏమి తాగించాలి, ఏమి తినిపించాలి అన్న విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి పిల్లలకు కొబ్బరి నీళ్లు ఇవ్వొచ్చా లేదా అనే సందేహం. కొబ్బరి నీళ్లు పెద్దలకు చాలా ఆరోగ్యకరమైన పానీయం. అయితే పసిపిల్లల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. ఏ వయసు నుంచి పిల్లలకు కొబ్బరినీళ్లు ఇవ్వవొచ్చో తెలుసుకోండి.

6 నెలల లోపు పిల్లలకు పూర్తిగా నో
డాక్టర్ల ప్రకారం ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలు లేదా ఫార్ములా పాలు తప్ప మరేమీ అవసరం లేదు. ఈ దశలో పిల్లల కడుపు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. తల్లిపాలే వారికి సంపూర్ణ ఆహారం. అందులోంచే నీరు, పోషకాలు అందుతాయి. కావున 6 నెలల లోపు పిల్లలకు కొబ్బరి నీళ్లు తాగించడం మంచిది కాదు.

Advertisement

6 నెలల తర్వాత
శిశువు ఆరు నెలలు వయసు దాటిన తర్వాత ఘనాహారం మొదలుపెడతారు. ఈ దశలో కూడా నీళ్లు లేదా ఇతర పానీయాలు ఇవ్వడంలో జాగ్రత్త అవసరం. డాక్టర్లు సూచించే విధంగా చాలా తక్కువ పరిమాణంలో, అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు ఇవ్వవచ్చు.అయితే పిల్లలకు ఆ కొబ్బరి నీళ్లు పడుతున్నాయో లేదో గమనించాలి.

కొబ్బరి నీళ్లు సహజమైన ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటాయి. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నిషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి పెద్దలకు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయం చేస్తాయి. అయితే చిన్నారుల విషయంలో ఈ ప్రయోజనాలను చూడకూడదు. ఎందుకంటే వారి శరీరం అవసరాలు పెద్ద వారితో సరిపోవు. తల్లిపాలే వారికి సరిపడే ఎలక్ట్రోలైట్లు అందిస్తాయి.

Advertisement

ఎప్పుడు కొబ్బరి నీళ్లు ఇవ్వకూడదు?
కొబ్బరి నీటి ప్రభావానికి చిన్నారులు భిన్నంగా స్పందించవచ్చు. వారికి జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు ఇవ్వకూడదు. డయేరియా ఉన్నప్పుడు కూడా డాక్టర్ అనుమతి లేకుండా ఇవ్వకూడదు. అలర్జీ లక్షణాలు కనిపిస్తున్నా, వాంతులు అవుతున్నా కొబ్బరి నీళ్లు ఇవ్వకూడదు. కొన్నిసార్లు కొబ్బరి నీళ్లు తాగితే పిల్లల కడుపు ఉబ్బరం లేదా వాంతులు రావడం జరగవచ్చు. అలాంటప్పుడు వారికి కొబ్బరినీళ్లు దూరంగా ఉంచాలి.

ఎంత మొత్తంలో ఇవ్వాలి?
ఒక సంవత్సరంలోపు పిల్లలకు ఇవ్వాల్సి వచ్చినా రోజుకు రెండు మూడు చిన్న టీ స్పూన్లు మాత్రమే ఇవ్వాలి. అది కూడా ప్రతిరోజు కాకుండా వారంలో ఒక్కసారి లేదా రెండు సార్లకు మాత్రమే పరిమితం చేయాలి. అధికంగా ఇస్తే పిల్లల పొట్ట నిండిపోయి తల్లిపాలు తక్కువ తాగే ప్రమాదం ఉంది. పిల్లలకు ఏడాది వయసు దాటిన తర్వాత శరీరం కొంతవరకు ఎదుగుతుంది. ఈ దశలో కొబ్బరి నీళ్లు ఇవ్వడం సాధారణంగా హానికరం కాదు. రోజుకి చిన్న కప్పు కొబ్బరి నీళ్లు ఇవ్వవచ్చు.

0–6 నెలలు: కొబ్బరి నీళ్లు పూర్తిగా ఇవ్వకూడదు

6–12 నెలలు: చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే, అది కూడా అప్పుడప్పుడు.

ఏడాది వయసు దాటిన తర్వాత: పరిమితంగా ఇవ్వవచ్చు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×