E-Paper
Advertisement

Chicken Nuggets: రెస్టారెంట్ స్టైల్‌లో టేస్టీ చికెన్ నగెట్స్ ఇలా చేసేయండి, రెసిపీ చాలా సులువు

Chicken Nuggets: రెస్టారెంట్ స్టైల్‌లో టేస్టీ చికెన్ నగెట్స్ ఇలా చేసేయండి, రెసిపీ చాలా సులువు
Advertisement

పిల్లల నుంచి పెద్దల వరకు చికెన్ నగెట్స్ అంటే ఎంతో ఇష్టం. రెస్టారెంట్ స్టైల్ లో వీటిని ఇంట్లోనే వండుకోవచ్చు. దీన్ని బయట తింటే అది శుచిగా ఉండకపోవచ్చు. కాబట్టి దీన్ని శుచిగా, రుచిగా వండుకోవచ్చు.దీన్ని తక్కువ పదార్థాలతో, సింపుల్ గా తయారయ్యే ఈ చికెన్ నగెట్స్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి. ఇవి క్రిస్పీగా, రుచిగా ఉంటాయి.

చికెన్ నగెట్స్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ – పావుకిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – ఒక స్పూన్
కారం – అర స్పూన్
నిమ్మరసం – ఒక స్పూన్
గుడ్లు – రెండు
మైదా – అర కప్పు
బ్రెడ్ ముక్కలు – ఒక కప్పు
ఆయిల్ – డీప్ ఫ్రై కోసం

Advertisement

చికెన్ నగెట్స్ రెసిపీ
1. ముందుగా చికెన్ ముక్కలను గిన్నెలో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
2. ఈ మిశ్రమాన్ని కనీసం 20–30 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా మారినేట్ చేస్తే చికెన్ లోపలికి కూడా రుచి బాగా చేరుతుంది.
3. ఒక ప్లేట్‌లో మైదా వేసి పక్కన పెట్టాలి. మరో చిన్న బౌల్‌లో రెండు గుడ్లను పగలగొట్టి బాగా విసికాలి.
4. మిక్సీలో బ్రెడ్ ముక్కలను వేసి పొడిలా చేసుకుని ఒక ప్లేటులో వేసుకోవాలి.
5. మారినేట్ చేసిన చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుని మొదట మైదాలో దొర్లించాలి.
6. తర్వాత ఆ ముక్లకను గుడ్డు మిశ్రమంలో ముంచి తీసి వెంటనే బ్రెడ్ క్రంబ్స్‌లో రోల్ చేయాలి.
7. ఈలోపు స్టవ్ మీద కళాయిపెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా వేడి చేయాలి.
8. చికెన్ ముక్కలను అందులో వేసి వేయించాలి. బంగారు రంగులోకి మారాక తీసిటిష్యూ పేపర్‌పై వేయాలి. ఇది అదనపు నూనె పీల్చేస్తుంది.

అంతే టేస్టీ చికెన్ నగెట్స్ రెడీ అయినట్టే. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిని కెచప్, మయోనైస్, చిల్లీ సాస్ లేదా గార్లిక్ డిప్‌తో సర్వ్ చేస్తే రుచి మరో లెవల్‌లో ఉంటుంది. చికెన్ నగెట్స్ ఇంట్లో తయారైనవి కాబట్టి ప్రిజర్వేటివ్‌లు ఉండవు. ఫ్రోజెన్ నగెట్స్ కంటే ఈ తాజా నగెట్స్ ఆరోగ్యకరం.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×