E-Paper
Advertisement

OPPO Reno14 5G: అప్‌డేటెడ్ లుక్‌తో ఒప్పో రెనో14 5జి.. డిజైన్‌పై వినియోగదారుల ఆసక్తి

OPPO Reno14 5G: అప్‌డేటెడ్ లుక్‌తో ఒప్పో రెనో14 5జి.. డిజైన్‌పై వినియోగదారుల ఆసక్తి

OPPO Reno14 5G:  ఇండియన్ మార్కెట్లో ఒప్పో ఫోన్ మరోసారి దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్త అప్‌డేటెడ్ లుక్‌, మెరుగైన కెమెరా సామర్థ్యం‌, తగినంత బ్యాటరీ పనితీరుతో రెనో సిరీస్‌లో తాజా మోడల్ అయిన ఒప్పో రెనో14 5జి అధికారికంగా మార్కెట్‌లోకి ప్రవేశించింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ ఫోన్ డిజైన్ నుంచి పనితీరు వరకు ప్రతి విభాగంలో ఒప్పో తన ప్రత్యేకతను మరోసారి నిరూపించిందని తెలుస్తోంది. ధర‌, ఆఫర్లు‌, స్పెసిఫికేషన్స్ పై వినియోగదారుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి కనిపిస్తోంది.

స్మూత్‌నెస్ డిస్‌ప్లే

డిస్‌ప్లే ఓపెన్ చేసిన వెంటనే చూపుకు పడేది రంగులు, స్క్రీన్ లైటింగ్, విజువల్ స్మూత్‌నెస్. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోల్ చేసినా, వీడియోలు చూసినా, సోషల్ మీడియా యాప్‌లు అన్నీ ఒకే సారి బాగా కంటిన్యూ అవుతాయి. బయట సూర్యకాంతిలో కూడా స్క్రీన్ ప్రకాశం తగ్గకుండా తగినంత స్పష్టతతో కనిపించటం రెనో 14 5జి ప్రత్యేకతల్లో ఒకటి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వీడియోలు చూసినా, గేమింగ్ చేసినా, ఈ డిస్‌ప్లే క్వాలిటీ ప్రీమియమ్ సెగ్మెంట్ ఫీలింగ్‌ను ఇస్తుంది.

సెల్ఫీ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

కెమెరా పనితీరం కూడా ఈ మోడల్‌లో చాలా బలంగా ఉంటుంది. వెనుక మూడు లెన్స్‌లు ఉంటాయి, అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫోటోల్ని క్లియర్‌గా, రంగుల్ని సహజంగా అందుకుంటుంది. సెల్ఫీ కోసం ఇచ్చిన 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేస్ క్లారిటీని తగినంత స్పష్టంగా చూపిస్తుంది. రోజువారీ ఫోటోలు తీసేవారికి కానీ, సోషల్ మీడియా రీల్స్ చేసే వారికి ఈ కెమెరా కాంబినేషన్ చాలా ఉపయోగపడుతుంది.

Also Read: Poco F8 5G Mobile: 7700mAh బ్యాటరీతో పోకో ఎఫ్8 5జి ఎంట్రీ.. ఇండియాలో ధర ఎంతంటే?

512జిబి స్టోరేజ్

పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ నిజంగా ఆశ్చర్యపరచేలా ఉంటుంది. 8జిబి ర్యామ్ ప్లస్ 256జిబి స్టోరేజ్, 12జిబి ర్యామ్ ప్లస్ 256జిబి లేదా 512జిబి స్టోరేజ్ వేరియంట్లలో లభించడం వల్ల అవసరాన్ని బట్టి ఎంచుకునే అవకాశముంటుంది. ల్యాగ్ అన్న మాట వినిపించకుండా, గేమింగ్‌, మల్టీటాస్కింగ్‌, రోజూ చేసే పనులన్నీ స్మూత్‌గా నడిచే విధంగా సెటప్ చేశారు.

బ్యాటరీ సపోర్ట్

బ్యాటరీ కూడా ఒకే ఛార్జ్‌తో గంటల పాటు నిలబడే రీతిలో ఆప్టిమైజ్ చేయబడింది. రోజు మొత్తం వాడినా ఇంకా చార్జ్ పెట్టాలా? అనే భావన పెద్దగా రాకుండా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఆవసరమైనప్పుడు కొద్ది నిమిషాలకే ఫోన్ మళ్లీ సిద్ధమవుతుంది. ఇది రెనో14 5జి ఉపయోగంలో మరింత సౌకర్యానిస్తుంది.

ధర ఎంతంటే?

ధర విషయానికి వస్తే ఇండియాలో ఈ మోడల్ ప్రారంభ ధర సుమారు రూ.37,999 నుంచి రూ.39,999 మధ్య కనిపిస్తుంది. వేరియంట్‌ను బట్టి ధర కొంచెం మారుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఎక్కువగా నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు ఉంటాయి కాబట్టి వాయిదాల్లో కొనాలనుకునేవారికి ఇది పర్‌ఫెక్ట్. పాత ఫోన్ ఇవ్వడం ద్వారా తగ్గింపు వచ్చే ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కొంతకాలం ప్రత్యేక సేల్ సమయంలో ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది. బ్యాంకు కార్డు ఆఫర్లు కూడా అప్పుడప్పుడు లభిస్తాయి కాబట్టి కొనేటప్పుడు ఆన్‌లైన్‌లో ఒకసారి చెక్ చేస్తే మరింత తగ్గే అవకాశం ఉంటుంది.

Related News

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×