E-Paper
Advertisement

చికెన్‌లో ఈ పార్టులు తింటున్నారా? జాగ్రత్త, ఆస్పత్రిపాలు కావచ్చు.. ఎందుకంటే?

చికెన్‌లో ఈ పార్టులు తింటున్నారా? జాగ్రత్త, ఆస్పత్రిపాలు కావచ్చు.. ఎందుకంటే?
Advertisement

Chicken: చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ కావడంతో ఫిట్‌నెస్ ప్రేమికులు కూడా దీనికే జై కొడతారు. అయితే.. చికెన్ మొత్తం ఆరోగ్యకరమేనా? అంటే కాదనే అంటున్నారు నిపుణులు. మనం తినే చికెన్‌లో కొన్ని భాగాలు మన శరీరానికి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేస్తాయి. రుచిగా ఉన్నాయని అన్నింటినీ లాగించేస్తే.. మనమే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. అసలు చికెన్‌లో వేటిని తినకూడదు ? వేటిని తినాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

చికెన్‌లో ఏ భాగాలు తినాలి ? 

1. చికెన్ స్కిన్ (కోడి చర్మం):
చాలా మందికి చికెన్ స్కిన్ అంటే చాలా ఇష్టం. కానీ.. ఇందులో కేవలం ‘శాచురేటెడ్ ఫ్యాట్’ (చెడు కొవ్వు) మాత్రమే ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాకుండా.. స్కిన్‌తో కలిపి వండినప్పుడు క్యాలరీలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది.

Advertisement

2. మెడ, తల:
కోడి మెడ భాగంలో లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లకు ఆవాసంగా మారే అవకాశం ఉంది. అలాగే.. కోడికి ఇచ్చే యాంటీబయాటిక్స్ లేదా హార్మోన్ ఇంజెక్షన్ల ప్రభావం కూడా ఈ మెడ భాగంపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3. ఊపిరితిత్తులు(లంగ్స్):
కోడి ఊపిరితిత్తులలో కూడా అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని ఎంత ఉడికించినా కొన్ని రకాల మొండి క్రిములు చనిపోవు. ఇవి తింటే జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీటిని తినకపోవడమే బెస్ట్.

Advertisement

4. గిజార్డ్ లేదా కందనకాయ:
కందనకాయ చాలా మందికి ఇష్టమైన భాగం. అయితే.. ఇందులో కొలెస్ట్రాల్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. గుండె సమస్యలు ఉన్న వారు లేదా అధిక బరువు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. అలాగే.. ఇది కోడి ఆహారాన్ని అరిగించే భాగం కాబట్టి, దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా కష్టం.

Also Read: నో జిమ్.. నో వెయిట్స్! కేవలం వాకింగ్‌తో మీ బాడీని సెట్ చేసుకోండి బాస్ !

5. కాళ్లు, తోక భాగం:
కోడి కాళ్లు మలినాలతో ఎక్కువగా అంటుకుని ఉంటాయి. సరిగ్గా క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయి. తోక భాగంలో గ్రంధులు ఎక్కువగా ఉండి.. కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఇవి మన జీర్ణక్రియను ఇబ్బంది పెడతాయి.

మరి ఏం తినాలి?
చికెన్‌లో చికెన్ బ్రెస్ట్ (ఛాతి భాగం) అత్యంత ఆరోగ్యకరమైంది. ఇందులో కొవ్వు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత లెగ్ పీస్, వింగ్స్ కూడా మంచివే. కాకపోతే వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయడం కంటే.. గ్రేవీలా లేదా గ్రిల్డ్ చికెన్ లా తీసుకుంటే ఆరోగ్యం.

గమనిక: ఈ సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి శరీరతత్వం వేరుగా ఉంటుంది, కాబట్టి ఆరోగ్య పరంగా ఏవైనా సందేహాలుంటే ఖచ్చితంగా పోషకాహార నిపుణులను లేదా డాక్టర్లను సంప్రదించి మీ డైట్ ప్లాన్ చేసుకోవడం మంచిది.

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

Big Stories

Advertisement
×