E-Paper
Advertisement

Coffee: మీకు రోజూ కాఫీ తాగే అలవాటుందా? ఇది చర్మాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?

Coffee: మీకు రోజూ కాఫీ తాగే అలవాటుందా? ఇది చర్మాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?
Advertisement

ప్రతిరోజూ ఉదయం కాఫీ తాగడం చాలా మందికి అలవాటే. ఒక కప్పు కాఫీ తాగితే అలసట పోయి, శరీరానికి ఉత్సాహం వస్తుంది. కానీ తాజాగా నిపుణులు చెబుతున్న విషయం ఏమిటంటే మన రోజువారీ కాఫీ అలవాటు మన చర్మంపై కూడా ప్రభావం చూపుతుందట. కాఫీలో ఎక్కువగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మన చర్మాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి కాలుష్యం, సూర్య కిరణాల వల్ల వచ్చే నష్టాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం త్వరగా వృద్ధాప్యం చెందకుండా కాపాడుతుంది.

కాఫీలో యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంలో వచ్చే ఎర్రదనం, వాపు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మొటిమలు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇంకా కాఫీ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. దీంతో చర్మానికి ఎక్కువ ఆక్సిజన్ చేరి, ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

Advertisement

అలాగే కాఫీ పొడి ఉపయోగించి స్క్రబ్ చేసుకుంటే, చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోతుంది. దీంతో చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, కాఫీ సూర్యకిరణాల వల్ల వచ్చే నష్టాన్ని కూడా కొంతవరకు తగ్గించగలదని చెబుతున్నారు.

Also read:Elinati Shani: ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవాలంటే శనివారం రావి చెట్టు దగ్గర ఇలా చేయండి

Advertisement

కాఫీ తాగితే వచ్చే సమస్యలు
కాఫీని ఎక్కువగా తాగితే సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా రోజుకు 2 కప్పులకంటే ఎక్కువ తాగితే ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. కాఫీ ఎక్కువగా తాగితే డీహైడ్రేషన్ జరుగుతుంది. అంటే శరీరంలో నీరు తగ్గిపోతుంది. దీంతో చర్మం ఎండిపోయినట్టు, డల్‌గా కనిపిస్తుంది. కాఫీ వల్ల శరీరంలో కోర్టిసోల్ హార్మోన్ పెరుగుతుంది. ఇది ఆయిల్ ఉత్పత్తిని పెంచి, మొటిమలు వచ్చే అవకాశం పెంచుతుంది. ఎక్కువ కాఫీ తాగితే చర్మం సూర్య కాంతికి సెన్సిటివ్ అవుతుంది. దీంతో పిగ్మెంటేషన్ సమస్యలు రావచ్చు.

Also read: BedRoom Vastu: బెడ్‌రూమ్‌లో ఉండకూడని వస్తువులు ఇవన్నీ, అవి ఉంటే ఇంట్లో గొడవలే

కొంతమందికి కాఫీ వల్ల అలర్జీ సమస్యలు కూడా వస్తాయి. చర్మం ఎర్రబడటం, దురద రావడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇంకా చాలా ఎక్కువగా తాగితే ముఖం మసకబారినట్టు, ఉత్సాహం లేనట్టు కనిపించవచ్చు. రోజుకు 1 నుంచి 2 కప్పుల కాఫీ తాగితేనే చర్మానికి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అంతకంటే ఎక్కువ తాగితే నష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే కాఫీలో ఎక్కువగా చక్కెర, క్రీమ్ కలపడం కూడా మంచిది కాదు. ఇవి మొటిమలు, చర్మ సమస్యలను పెంచే అవకాశం ఉంది.

కాఫీ ఎలా తాగాలి?
రోజుకు కాఫీ 1–2 కప్పులు మాత్రమే తాగాలి. అందులోనూ బ్లాక్ కాఫీ తీసుకోవడం మంచిది. రోజంతా ఎక్కువ నీరు తాగాలి. బయటికి వెళ్తే సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదు.

Tags

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×