E-Paper
Advertisement

Dangerous Bacteria: సూపర్ మార్కెట్లో ట్రాలీ వాడుతున్నారా? ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే ఇంకెప్పుడూ ఆ తప్పు చేయరు!

Dangerous Bacteria: సూపర్ మార్కెట్లో ట్రాలీ వాడుతున్నారా? ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే ఇంకెప్పుడూ ఆ తప్పు చేయరు!
Advertisement

Dangerous Bacteria: సాధారణంగా ఇంటికి సరుకులు కావాలన్నా.. ఇంకేం అవసరం ఉన్నా 90 శాతం మంది సూపర్ మార్కెట్లకే వెళ్తుంటారు. ఎందుకంటే.. అక్కడే అన్నీ ఒకేచోట దొరుకుతాయనే భరోసాతో. అయితే సూపర్ మార్కెట్‌కు వెళ్లగానే అందరూ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే.. ప్రతి చిన్నదానికీ అక్కడున్న ట్రాలీలను వాడటం. తాజాగా ఈ ట్రాలీలపై అమెరికాలో ఓ స్టడీ నిర్వహించారు. 85 సూపర్ మార్కెట్ల నుంచి కొన్ని ట్రాలీలను సెలెక్ట్ చేసి, వాటి మీద అధ్యయనం చేశారు. దాంట్లో తేలింది ఏమిటంటే.. మనం పట్టుకున్న ట్రాలీ హ్యాండిల్ మీద చాలా పెద్ద సంఖ్యలో బ్యాక్టీరియా నిల్వ ఉంటుందట.

డేంజరస్ బ్యాక్టీరియా:

సూపర్ మార్కెట్ ట్రాలీల హ్యాండిల్స్ మీద ఈ. కోలి (E. coli-Escherichia coli) అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా అధిక సంఖ్యలో నిల్వ ఉంటుందట. సాధారణంగా ఈ. కోలి బ్యాక్టీరియా టాయిలెట్ కమోడ్ మీద అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్‌లో బీభత్సంగా ఉంటుంది. అలాగే మనం ప్రతిరోజూ గిన్నెలు తోముకునే పీచు, స్క్రాచ్ బైట్ ఇట్లాంటివి వాటి మీద కూడా ఈ బ్యాక్టీరియా అధిక సంఖ్యలో నిల్వ ఉంటుందట. అలాంటి బ్యాక్టీరియాను సూపర్ మార్కెట్‌లో ప్రతి ఒక్కరూ వాడే ట్రాలీ హ్యాండిల్ మీద గుర్తించారు. అది కూడా కొన్ని వందల రెట్ల సంఖ్యలో.

జీర్ణవ్యవస్థను దెబ్బ తీస్తుంది:

Advertisement

ఈ నేపథ్యంలో ట్రాలీని పట్టుకున్న చేతులను మన ముఖం మీద పెట్టినప్పుడు లేదా నోటి దగ్గర చేయి పెట్టినప్పుడు చేతి ద్వారా ఆ బ్యాక్టీరియా మన కడుపులోకి వెళ్లిపోతుంది. ఇలా మన పొట్టలోకి వెళ్లిన ఈ. కోలి బ్యాక్టీరియా మన గట్ హెల్త్‌ను విపరీంగా దెబ్బ తీస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా విరేచనాలు, వాంతులు వైరల్ ఫీవర్ ఇలా.. రకరకాల ఇన్‌ఫెక్షన్ల బారీన మనల్ని పడేస్తుంది.

పిల్లలు జాగ్రత్త:

అంతేకాదు.. సూపర్ మార్కెట్‌కు వెళ్లే ప్రతి తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏమిటంటే.. పిల్లల్ని తీసుకెళ్లి ఆ ట్రాలీ మీద కూర్చుబెట్టడం. పిల్లలు కూడా ఆ ట్రాలీని పట్టుకుని ఆడుకుంటుంటారు. ఆ తర్వాత చేతులను ముఖం, నోటి దగ్గర పెడుతుంటారు. ముఖ్యంగా ఈ. కోలి బ్యాక్టీరియా అనేది పిల్లలకు ఇంకా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ట్రాలీ వాడాల్సి వస్తే:

Advertisement

ఒకవేళ తప్పని పరిస్థితుల్లో సూపర్ మార్కెట్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు ట్రాలీ తీసుకోవాల్సిందే అనుకుంటే.. ఒక శానిటర్ తీసుకుని ముందుగా ట్రాలీ హ్యాండిల్ మీద స్ప్రే చేసి, దాన్ని వైబ్ చేసి అప్పుడు దానిని పట్టుకోండి. అలాగే మీ షాపింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్లీ శానిటేజర్‌తో మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి. అలాగే పిల్లల్ని ఆ ట్రాలీ మీద కూర్చోపెట్టకపోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. దీంతోపాటు మార్కెట్‌కు వెళ్లినప్పుడు సాధ్యమైనంత వరకు ట్రాలీ వాడకాన్ని కూడా తగ్గించాలని సూచిస్తున్నారు.

 

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×