E-Paper
Advertisement

Happy Children’s Day 2025: ఖరీదైన వస్తువులే కాదు.. ‘చిల్డ్రన్స్‌ డే’కి ఇలాంటి బహుమతులు ఇచ్చి చూడండి!

Happy Children’s Day 2025: ఖరీదైన వస్తువులే కాదు.. ‘చిల్డ్రన్స్‌ డే’కి ఇలాంటి బహుమతులు ఇచ్చి చూడండి!
Advertisement

Children’s Day 2025: కొంతమంది తల్లిదండ్రులు ఈ సారి బాలల దినోత్సవం సందర్భంగా.. చాక్లెట్లు, స్వీట్లు, నచ్చిన బొమ్మలు, గ్యాడ్జెట్స్, ఫేవరేట్ షూస్, వాట్చెస్ వంటి ఖరీదైన కానుకలు ఇస్తుంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మంచి చేసే ఉద్దేశంతో.. అడిగినవన్నీ కొనిస్తూ.. వారిని ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అయితే, కాలం మారుతున్న కొద్దీ తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. ప్రతిసారీ ఖరీదైన బహుమతులే కాకుండా.. చిన్నారులకు వాళ్ల బాల్యాన్ని బహుమతిగా ఇస్తే మరింత సంతోషంగా వారి జీవితం సాగిపోతుంది. అవేంటంటే..

చిన్న చిన్న పనులు చాలు:

పిల్లలు కాస్త పెద్దవాళ్లు అవుతున్న కొద్దీ.. తల్లిదండ్రులు వారి నుంచి క్రమంగా దూరమవుతుంటారు. దానివల్ల వారిలో ఒంటరితనం పెరుగుతోందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. పిల్లలు ఎంత పెద్దవాళ్లయినా సరే వారిని దగ్గరికి తీసుకోవడం, ముద్దు చేయడం ఆపవద్దు. పిల్లలతో రోజులో కొంత సమయం గడపండి. ఎంతసేపూ ఇంట్లోనే కాదు.. అప్పుడప్పుడూ పచ్చటి పొలాలూ, అభయారణ్యాలకి తీసుకెళ్లండి. పిల్లల్లోని తెలియని భయం పోయేలా వారిలో ధైర్యాన్ని నింపండి. అంటే.. మట్టిలో ఆడుకోవడం, వానలో తడవటం, మొక్కలు నాటడం లాంటివి వారితో చేయించండి.

ఇతరులపై కరుణ చూపేలా:

Advertisement

ఎదుగుతున్న పిల్లల్లో కోపం, ఆవేశం, అక్కసు, అసూయ, భయాలు వంటివి సర్వసాధారణం. అలాంటి వాటిని వేలెత్తి చూపడం, చెడుగా మాట్లాడటం వంటివి చేయకూడదు. మీ మాటలు వారిలో అపరాధ భావం కలిగిస్తాయి. కోపాన్ని పట్టుదలగా, ఆవేశాన్ని శ్రమగా, అసూయని పోరాటపటిమగా మార్చుకోవాలని నిధానంగా చెప్పండి. ఇలాంటి సందర్భాల్లో పిల్లలకు పెట్స్‌ను దగ్గర చేయడం ఉత్తమం. పెంపుడు జంతువులు చూపించే ప్రేమ పిల్లల్ని సంతోషంగా ఉంచుతుంది. అప్పుడప్పుడూ వృద్ధాశ్రమాలకి తీసుకెళ్లడం, ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ వంటివి చూపించేలా వారికి దిశానిర్దేశం చేయండి.

ప్రమాణాలు పాటించండి:

బండి‌ మీద వెళ్తున్నప్పుడు పిల్లలకైనా సరే.. హెల్మెట్‌ ఉండాల్సిందే. 9 నెలల బిడ్డ నుంచి నాలుగేళ్ల చిన్నారి వరకూ ఐఎస్‌ఐ ప్రమాణాలున్న పిల్లల హెల్మెట్‌ వాడాల్సిందే. పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు బండి స్పీడు 40 కి.మీ.కు మించకుండా చూసుకోండి. సడెన్‌గా బ్రేకులు వేసినా, పిల్లలు బ్యాలెన్స్‌ తప్పి పడిపోతారు. కాబట్టి.. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే పిల్లలకు కూడా హెల్మెట్స్ ఉండేలా చూసుకోండి.

విజ్ఞానం పంచే పుస్తకాలు:

Advertisement

ప్రపంచంలోని జ్ఞానం అంతా పుస్తకాల్లో దాగి ఉంటుంది. పిల్లలకు ఇది నేర్చుకునే వయసు, విజ్ఞానం పొందే వయసు. కాబట్టి.. వారికి టెక్ట్స్‌బుక్స్ మాత్రమే కాకుండా.. కార్టూన్ రూపంలో ఉండే పుస్తకాలను గిఫ్ట్‌గా ఇవ్వండి. దీంతోపాటు ప్రపంచ పటాన్ని చూపే అట్లాస్ లాంటివి కూడా ఇవ్వొచ్చు. పిల్లలకు పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం, చదివే అలవాటును పెంపొందించడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత కిందకే వస్తుంది.

పిగ్గీ బ్యాంకు:

తల్లిదండ్రుల వద్ద ఎంత డబ్బున్నా.. పిల్లలకు పొదుపు విలువను నేర్పించడం చాలా అవసరం. ఈ బాలల దినోత్సవం సందర్భంగా.. చిన్నారులకు పిగ్గీ బ్యాంకును బహుమతిగా ఇవ్వొచ్చు. వారు సంపాదించుకోగలిగిన ప్రతి పైసాను ఆదా చేయడం నేర్పించడండి. ఏడాది చివరిలో వాళ్లెంత పొదుపు చేసారో చూపించమని అడగండి. ఇలా.. పోగుచేసిన డబ్బుతో వారికి అవసరమైన వస్తువులు కొనండి.

Related News

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

Big Stories

Advertisement
×