E-Paper
Advertisement

Tulasi Plant: చలికాలంలో తులసి మొక్క ఎండిపోతోందా? ఇలా కాపాడుకోండి

Tulasi Plant: చలికాలంలో తులసి మొక్క ఎండిపోతోందా? ఇలా కాపాడుకోండి
Advertisement

చలికాలం మొదలైపోయింది. ఈ కాలంలో ఇంట్లో ఉన్న తులసి మొక్కలు వాడిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, కొమ్మలు ఎండిపోవడం వంటి సమస్యలు కనపిస్తాయి. తులసి మొక్క మన ఇంటి పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. దీనిని పూజలో, ఔషధంగా కూడా వాడతారు. అయితే చలికాలంలో తులసి మొక్కను పచ్చగా, ఆరోగ్యంగా ఉంచడం కొంచెం కష్టమే. కానీ కొంత శ్రద్ధ తీసుకుంటే చలి కాలంలో కూడా తులసి మొక్క సజీవంగా, ఆరోగ్యంగా ఎదుగుతుంది.

సూర్యరశ్మి తప్పనిసరి
తులసి మొక్కకు సూర్యరశ్మి చాలా అవసరం. చలికాలంలో రోజుకు కనీసం 4 గంటలపాటు సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. చలి కారణంగా సూర్యరశ్మి తక్కువగా ఉండడం వలన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారతాయి, పెరుగుదల లోపిస్తుంది. కాబట్టి తులసి మొక్కను ఎప్పుడూ సూర్యరశ్మి బాగా వచ్చే ప్రదేశంలో ఉంచండి. ఇంటి బాల్కనీ, కిటికీ పక్కన లేదా మేడపై ఉంచితే మంచిది.

Advertisement

చలికాలంలో చాలా మంది ప్రతిరోజూ నీరు వేస్తుంటారు. కానీ ఇది తప్పు. చలికాలంలో మట్టి తేమగా ఉంటుంది. ఎక్కువ నీరు పోస్తే తులసి వేర్లు కుళ్లిపోతుంది. కాబట్టి మట్టి పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీటివ్వాలి. నీరు నిల్వ కాకుండా కుండలో చిన్న రంధ్రాలు ఉండేలా చూసుకోండి. మట్టిని తడిగా కాకుండా తేమగా ఉంచడమే సరైన పద్ధతి.

ఇలా ఎరువు వేయండి
తులసి మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే మట్టి గాలి చొరబడేలా ఉండాలి. 60 శాతం తోట మట్టి, 20 శాతం ఎరువు, 20 శాతం ఇసుక కలిపితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ మిశ్రమం మట్టిలో తేమను నిలుపుతుంది. నీరు బయటకు సులభంగా పోతుంది. వారానికి ఒకసారి కంపోస్ట్ లేదా ఆర్గానిక్ ఎరువు కలపడం తులసి మొక్క బాగా ఎదుగుతుంది.

Advertisement

ఈ చిన్నచిట్కా పాటించండి
తులసి మొక్కకు పోషకాలు అందించడానికి ఇంట్లోనే ఉండే పదార్థాలతో ద్రావణం తయారు చేసుకోవచ్చు. ఒక లీటర్ నీటిలో ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, అరకప్పు ఉప్పు కలిపి మిశ్రమం తయారు చేయండి. వారానికి ఒకసారి ఈ ద్రావణాన్ని మొక్క చుట్టూ పోయండి. ఇది మట్టిలో సూక్ష్మజీవుల చలనం పెంచి, మొక్కకు అవసరమైన పోషకాలు అందిస్తుంది. దీంతో ఆకులు మరింత పచ్చగా, ఆరోగ్యంగా మారతాయి.

చలికాలంలో రాత్రివేళల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది. ఈ సమయంలో తులసి మొక్కను బయట ఉంచడం మంచిది కాదు. రాత్రి సమయంలో తులసిని గది లోపలికి తీసుకువెళ్ళండి లేదా చలి గాలి తగలని ప్రదేశంలో ఉంచండి. గాలి ఎక్కువగా తగలకుండా కిటికీ మూసి ఉంచడం మంచిది. ఇలా చేస్తే చలిగాలి కారణంగా మొక్క ఆకులు వాడిపోకుండా ఉంటాయి.

తులసి మొక్క ఆకులను ప్రతిరోజూ తీయడం కాకుండా వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా ఆకులు తీయడం వల్ల మొక్క బలహీనంగా మారుతుంది. అలాగే పువ్వులు ఎక్కువగా వస్తే వాటిని తీసేయండి. పువ్వులు ఎక్కువగా ఉండటం వల్ల మొక్క పెరుగుదల తగ్గుతుంది. పాత ఆకులను తొలగించడం ద్వారా కొత్త మొగ్గలు త్వరగా వస్తాయి.

తులసి మొక్క చుట్టూ ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. పొద చుట్టూ ఎండిన ఆకులు, గడ్డి తొలగించండి. వారానికి ఒకసారి ఎరువుతో పాటు తేలికగా నీటివ్వండి. రోజుకు ఒకసారి ఆకులను తడి బట్టతో తుడవడం ద్వారా దుమ్ము తొలగించాలి. ఉదయం సూర్యరశ్మి తగిలే సమయానికి మొక్కకు నీటివ్వడం మంచిది. చలికాలం తులసి మొక్కకు కాస్త కష్టమైన కాలం అయినప్పటికీ, ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మొక్క చల్లని వాతావరణంలో కూడా పచ్చగా, బలంగా పెరుగుతుంది. తులసి కేవలం పవిత్ర మొక్క మాత్రమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ మొక్క కూడా.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×