E-Paper
Advertisement

Dehydration: డీ హైడ్రేషన్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు, నీరు తాగకపోతే శరీరంలో జరిగేది ఇది

Dehydration: డీ హైడ్రేషన్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు, నీరు తాగకపోతే శరీరంలో జరిగేది ఇది
Advertisement

మన శరీరానికి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ చాలా మంది రోజూ తాగాల్సినంత నీటిని తాగరు. ఏ కాలమైనా శరీరానికి తగినంత నీరు అవసరమే. ఎప్పుడైతే శరీరంలో నీటికొరత ఏర్పడుతుందో ఆ పరిస్థితిని వైద్యులు డీ హైడ్రేషన్ అని అంటారు. శరీరంలో నీరు తగ్గిపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు రావచ్చు. డీ హైడ్రేషన్ వల్ల వచ్చే ముఖ్యమైన ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోండి.

రక్తహీనత ప్రమాదం
మన శరీరంలో రక్తం ప్రసరించడానికి నీళ్లు చాలా అవసరం. నీరు తగ్గిపోతే రక్తప్రసరణ మందగిస్తుంది. దీని ప్రభావం హిమోగ్లోబిన్ స్థాయిలపై కూడా0 పడుతుంది. ఫలితంగా, అలసట, బలహీనత, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి రక్తహీనత లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు సరైన నీరు తాగకపోతే ఈ సమస్య మరింతగా కనిపిస్తుంది.

Advertisement

ఆందోళన, ఒత్తిడి పెరగడం
శరీరంలో నీరు తక్కువగా ఉండడం వల్ల మెదడు పనితీరు కూడా తగ్గుతుంది. శరీరం డీ హైడ్రేట్ అయితే మెదడుకు అవసరమైన ద్రవాలు తగ్గిపోతాయి. దీంతో చిరాకు, ఆందోళన, గందరగోళం, ఒత్తిడి ఎక్కువగా ఫీలవుతారు. రోజంతా దుఃఖంగా, చిరాకు గా ఉండడానికి నీటి లోపం కూడా ఒక కారణం కావచ్చు. చాలా మందికి ఇది తెలియదు.

నోటిలో దుర్వాసన
డీహైడ్రేషన్ వల్ల నోరు పొడిగా మారుతుంది. నోరులో లాలాజలం తగ్గిపోతే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియాల వల్లనే నోటిలో దుర్వాసన వస్తుంది. ఎంతసార్లు బ్రష్ చేసినా, ఎంతసార్లు మౌత్ వాష్ వాడినా దుర్వాసన తగ్గకపోతే, మీరు తాగుతున్న నీటి పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.

Advertisement

జుట్టు రాలడం
శరీరంలో నీరు తగ్గిపోతే చర్మంలోని తేమను కోల్పోతుంది. ఇది చర్మాన్ని పొడిగా, ముడతలు పడేలా చేస్తుంది. అలాగే జుట్టుకి అవసరమైన పోషకాలు రక్తం ద్వారా వెళ్లకపోవడంతో జుట్టు బలహీనమవుతుంది. దీని వల్ల జుట్టురాలడం, చుండ్రు రావడం వంటి సమస్యలు పెరుగుతాయి.

మూత్రపిండాల సమస్యలు
డీ హైడ్రేషన్ ప్రధానంగా ప్రభావం చూపే అవయవం మూత్రపిండాలు. నీరు తక్కువగా ఉంటే కిడ్నీలు విష పదార్థాలను సరిగా బయటకు పంపలేవు. దీని వల్ల మూత్రం చిక్కగా మారటం, మంట రావడం, మూత్రపిండ రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా డీహైడ్రేషన్ కొనసాగితే మూత్రపిండాల పనితీరు తగ్గిపోయే ప్రమాదం ఉంది.

అలసట, తలనొప్పి
శరీరానికి నీరు తగ్గిపోతే రక్తపోటు కూడా తగ్గుతుంది. రక్తపోటు తగ్గడంతో తలనొప్పి, తిమ్మిరి, బలహీనంగా అనిపించడం, నడవడంలో అస్థిరత వస్తాయి. రోజూ ఇలా అనిపిస్తే, మీరు తాగుతున్న నీటి పరిమాణాన్ని వెంటనే పెంచాలి.

ఏం చేయాలి?
రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగాలి. వేసవి రోజుల్లో బయట తిరుగుతున్నప్పుడు నీరు మరింత తాగాలి. కీరా, పుచ్చకాయ, ఆరెంజ్, కొబ్బరి నీరు వంటి హైడ్రేషన్ ఫుడ్స్ తీసుకోవాలి. అధిక చెమటపట్టే పనులు చేస్తే ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కూడా ఉపయోగపడతాయి. దాహం వేసేవరకు కాకుండా ముందే నీరు తాగే అలవాటు చేసుకోవాలి.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×