E-Paper
Advertisement

Chia Seeds Water: చియా సీడ్స్‌ ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Chia Seeds Water: చియా సీడ్స్‌ ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
Advertisement

Chia Seeds Water: చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తరచూ చియా సీడ్స్ తినడం వల్ల వాటిలో ఉండే ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు శరీరానికి చాలా రకాల మేలు చేస్తాయి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ, అధిక బరువు, శరీరంలో వేడి వంటి చాలా రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా చియా సీడ్స్ లో ఉండే కాల్షియం, ప్రోటిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తని పెంచడంలో సహాయపడతాయి. మరోవైపు శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తాయి. అయితే చాలా మందికి ఈ ప్రయోజనాల గురించి తెలుసు. కానీ చియా సీడ్స్‌తో చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ప్రతీ రోజున చియాసీడ్స్ రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తూ అనేక రకాల అనారోగ్య సమస్యలను నియంత్రిస్తుంది. కడుపులోని గ్యాస్, మంట, మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు చియా సీడ్స్ తినడం వల్ల ఫైబర్ అంది వాటికి చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా జీర్ణసమస్యలను నివారించేందుకు రాత్రిపూట నీటిలో నానబెట్టి తినడం మంచిది. ఇక, చియా సీడ్స్ గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. తరచూ వీటిని తీసుకోవడం వల్ల అనేక గుండె సంబంధింత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Advertisement

చియా సీడ్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చియా సీడ్స్ తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోయి అధిక బరువు వంటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు శరీరంలోని వేడిని తగ్గించడానికి కూడా ఇవి చాలా బాగా సహాయపడతాయి. తరచూ మజ్జిగలో చియా సీడ్స్ తీసుకోవడం వల్ల వేడి నుంచి ఉపశమనం ఉంటుంది. ప్రతీరోజూ ఉదయం నీటిలో నానబెట్టి రాత్రివేళ తాగినా కూడా ప్రయోజనం ఉంటుంది. ఇక చియా సీడ్స్ లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా తయారుచేసేందుకు తోడ్పడుతుంది.

Tags

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×