E-Paper
Advertisement

Raj Tarun: లావణ్య ఆత్మహత్యాయత్నం.. దిగొచ్చిన రాజ్ తరుణ్

Raj Tarun: లావణ్య ఆత్మహత్యాయత్నం.. దిగొచ్చిన రాజ్ తరుణ్
Advertisement

Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకొని.. రెండు సార్లు అబార్షన్ చేయించి.. ఇప్పుడు హీరోయిన్ మాల్వీతో ఎఫైర్ పెట్టుకొని తనను మోసం చేసి, వదిలించుకోవాలని చూస్తున్నట్లు లావణ్య పోలీస్ కేసు పెట్టిన విషయం తెల్సిందే.

అయితే లావణ్యతో ఒకప్పుడు రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అని, ఆ తరువాత ఆమె డ్రగ్స్ కు అలవాటు పడి, తనను కూడా డ్రగ్స్ తీసుకోమని బలవంతపెట్టిందని, అంతేకాకుండా మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉందని చెప్పుకొచ్చాడు. ఇలా ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

Advertisement

అంతేకాకుండా రాజ్ తరుణ్.. లావణ్య తాగి మత్తులో బూతులు మాట్లాడిన ఆడియో రికార్డును కూడా రిలీజ్ చేశాడు. దీంతో అందరూ లావణ్యను విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె తట్టుకోలేక ఈ మధ్యనే తన లాయర్ కు సూసైడ్ నోట్ పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో రాజ్ తరుణ్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. అంటే లావణ్యతో ఉండడానికి కాదు.. ఇలా కేసులు, గొడవలు అని కాకుండా సెటిల్ మెంట్ చేయడానికి రమ్మన్నాడట. దీంతో మళ్లీ అతడిపై లావణ్య కేసు పెట్టింది.

రాజ్ తరుణ్ సెటిల్ మెంట్ కోసం కాల్ చేసి పిలుస్తున్నాడు అని, సెటిల్ మెంట్ కు రమ్మని రాయబారాలు పంపుతున్నాడని తెలిపింది. ఇక దీన్ని కూడా పోలీసులు స్టేట్మెంట్ కింద రికార్డు చేసుకున్నారు. మరి ఈ కేసు ఎక్కడవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇంకోపక్క రాజ్ తరుణ్ సినిమాలు రెండు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి ఈ కేసుల వలన సినిమాలు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×