E-Paper
Advertisement

Weight loss: ఈ పసుపుపండు బరువు తగ్గేందుకు ఎంతలా సహాయపడుతుందో తెలుసా?

Weight loss: ఈ పసుపుపండు బరువు తగ్గేందుకు ఎంతలా సహాయపడుతుందో తెలుసా?
Advertisement

గర్భధారణ తర్వాత చాలామంది మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య బరువు పెరగడం. డెలివరీ అయిన తరువాత కూడా శరీరంలోని కొవ్వు తగ్గకపోవడం, పొట్ట భాగం పెద్దగా ఉండడం చూస్తూ ఉంటాము. ఈ సమయంలో డైట్ వ్యాయామంతో పాటు కొన్ని సహజ ఆహారాలు బరువు తగ్గడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో ఒకటి పైనాపిల్. ఈ పసుపు రంగు పండు బరువు తగ్గడంలో ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

పైనాపిల్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక కప్పు పైనాపిల్ ముక్కల్లో సుమారు 50 నుంచి 60 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అందుకే డైట్‌లో ఉన్నవారు దీనిని భయం లేకుండా తీసుకోవచ్చు. తక్కువ క్యాలరీలు ఉన్నప్పటికీ, ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. ఒకసారి తింటే ఎక్కువసేపు పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో తరచూ తినాలనే కోరిక తగ్గి, రోజువారీ క్యాలరీల వినియోగం తగ్గుతుంది.

Advertisement

పైనాపిల్‌ లో ముఖ్యంగా ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. డెలివరీ తర్వాత చాలామందికి జీర్ణ సమస్యలు, గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి ఇబ్బందులు వస్తాయి. అలాంటి వారికి పైనాపుల్ తినడం వల్ల ఈ సమస్యలు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. జీర్ణక్రియ మెరుగుపడితే శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా తగ్గుతుంది.

ఇంకా పైనాపిల్‌లో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, మెటబాలిజం మెరుగుపడటానికి కూడా సహాయపడుతుంది. మెటబాలిజం బాగా జరిగితే శరీరం క్యాలరీలను త్వరగా ఖర్చు చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గే ప్రక్రియకు మద్దతు లభిస్తుంది. అలాగే మ్యాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పైనాపుల్‌లో ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి.

Advertisement

పైనాపిల్ ఎలా బరువు తగ్గిస్తుంది
పైనాపిల్‌లో సహజంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. కొందరిలో నీరు నిల్వ ఉండటం వల్ల బరువు ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో పైనాపిల్ తీసుకుంటే ఊబకాయం కొంత తగ్గినట్టు అనిపించవచ్చు. ముఖ్యంగా పొట్ట భాగంలో ఉబ్బరం తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, పైనాపిల్‌ను మ్యాజిక్ ఫుడ్ గా భావించకూడదు. కేవలం పైనాపిల్ తింటేనే బరువు తగ్గిపోతుందని అనుకోవడం తప్పు. సరైన ఆహార నియమాలు, తేలికపాటి వ్యాయామం, సరిపడ నిద్ర కూడా తప్పనిసరి. పైనాపుల్‌ను సమతుల్య ఆహారంలో భాగంగా చేర్చినప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Also read: Chinese Oils: ఈ చైనా నూనెలు వాడారంటే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగేస్తుందట

పైనాపిల్ ఎలా తినాలి?
పైనాపిల్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఇందులో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి అధికంగా తింటే రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు లేదా షుగర్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే దీనిని తీసుకోవాలి. అలాగే ఎక్కువగా తింటే కొందరికి నోటి పూతలు, కడుపు మంట, జీర్ణ సమస్యలు రావచ్చు. పైనాపిల్‌ను ఉదయం లేదా మధ్యాహ్నం పూట ఒక కప్పు ముక్కలు తినవచ్చు. సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చు. జ్యూస్‌గా తాగాలనుకుంటే చక్కెర కలపకుండా తాగాలి. రోజుకు ఒక కప్పుకు మించకుండా తీసుకోవడం మంచిది. మొత్తానికి పైనాపిల్ ఆరోగ్యకరమైన పండు. డెలివరీ తర్వాత పెరిగిన బరువు తగ్గడంలో ఇది సహాయ పడుతుంది. ఆరోగ్యకర జీవనశైలితో పాటు ఈ పైనాపిల్ తీసుకుంటే ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×