E-Paper
Advertisement

పట్టు చీరలకు డ్రై క్లీనింగ్ అవసరం లేదు.. ఇంట్లోనే ఇలా చేస్తే చాలు

పట్టు చీరలకు డ్రై క్లీనింగ్ అవసరం లేదు.. ఇంట్లోనే ఇలా చేస్తే చాలు
Advertisement

భారత సంప్రదాయంలో పట్టు చీరలకు ఒక ప్రత్యేక ఉంది. అయితే వీటిని జాగ్రత్తగా వాష్ చేయాలి. చాలా మంది మహిళలు ఖరీదైన చీరలు డ్రై క్లీనింగ్‌ చేసేందుకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ సరైన పద్ధతిలో ఇంట్లోనే ఈ చీరలను సురక్షితంగా వాష్ చేయవచ్చు. ఓర్పుతో సరైన విధానం అనుసరిస్తే పట్టు చీరలు సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. మళ్లీ కొత్తగా మెరుస్తాయి. అయితే వాష్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే సిల్క్ నారలు, జరీ పని డ్యామేజ్ అవుతాయి.

చీరపై ఉన్న కేర్ లేబుల్ చదవండి

ప్రతి చీరతో పాటు ఒక కేర్ ఇన్‌స్ట్రక్షన్ లేబుల్ ఉంటుంది. ఇంట్లోనే ఈ చీరలు వాష్ చేయడానికి ముందు దాన్ని బాగా చదవండి. కొన్ని చీరలు డ్రై క్లీనింగ్ మాత్రమే చేయాలని ఉంటుంది. మరికొన్ని చీరలు జాగ్రత్తగా చేత్తో వాష్ చేస్తే బాగుంటాయి. లేబుల్ సలహాలను పాటించకపోతే చీర గుడ్డ, నేత పూర్తిగా డ్యామేజ్ కావొచ్చు.

చీర గుడ్డ, ఎంబ్రాయిడరీని జాగ్రత్తగా చూడండి

Advertisement

వివిధ రకాల సిల్క్ వస్త్రాలు నీటికి, డిటర్జెంట్‌కు వేర్వేరుగా స్పందిస్తాయి. బరువైన ఎంబ్రాయిడరీ, జరీ పని ఉన్న చీరలు మరింత జాగ్రత్త అవసరం. ప్యూర్ సిల్క్ చీరలు గట్టిగా తిప్పితే బలహీనమవుతాయి. అందుకే జాగ్రత్తగా తిప్పాలి. కానీ బ్రైడల్ చీరలు మాత్రం డ్రై క్లీనింగ్ చేయడం మంచిది. తేలికపాటి సిల్క్ చీరలు జాగ్రత్తగా ఇంట్లో వాష్ చేసుకోవచ్చు.

పూర్తిగా వాష్ చేయడానికి ముందు కలర్ టెస్ట్ చేయండి

డార్క్ కలర్ చీరల్లో.. కలర్ బ్లీడింగ్ ఎక్కువగా జరుగుతుంది. చీరలోని ఒక మూల భాగంలో ముందు ఒక టెస్ట్ చేయండి. ఒక కాటన్ (పత్తి) బాల్‌తో చల్లని నీళ్లు తడిపి చీరపై నొక్కండి. కలర్ కారుతుంటే పూర్తిగా నానబెట్టకండి. ఈ చిన్న పరీక్షతో పెద్ద నష్టం జరగకుండా నివారించవచ్చు.

చల్లని నీళ్లు మాత్రమే వాడండి

Advertisement

వేడి నీళ్లు సిల్క్ నారలను త్వరగా దెబ్బతీస్తాయి. నిపుణులు చల్లని నీళ్లతోనే కడగాలని సలహా ఇస్తారు. శుభ్రమైన బకెట్‌లో చల్లని నీళ్లు నింపండి. వేడి నీళ్లు చీర మెరుపును తగ్గిస్తాయి. చల్లని నీళ్లలో చీర సాఫ్ట్‌నెస్, ఒరిజినల్ లుక్ అలాగే ఉంటుంది.

తేలికపాటి డిటర్జెంట్ ఉపయోగించండి

స్ట్రాంగ్ డిటర్జెంట్లు ఖరీదైన చీరలను పాడు చేస్తాయి. బేబీ షాంపూ లేదా మైల్డ్ లిక్విడ్ డిటర్జెంట్ మాత్రమే వాడండి. పౌడర్ డిటర్జెంట్ సిల్క్‌పై మరకలు మార్కులు వదిలేస్తుంది. చాలా తక్కువ మొత్తంలో డిటర్జెంట్ నీటిలో కలపండి. ఇలా చేస్తే చీర సాఫ్ట్‌నెస్, మెరుపు ఎక్కువ కాలం ఉంటాయి.

చీరని రుద్దకండి లేదా స్క్రబ్ చేయకండి

పట్టు వస్త్రం సులభంగా చీలిపోతుంది. చీరని నీళ్లలో మెల్లగా ముంచండి. రుద్దకుండా, బ్రష్ వాడకుండా మెత్తగా కదిలించండి. ఇలా చేస్తే జరీ పని, చీర అందం కాపాడబడతాయి.

Also Read: మీరు ప్రేమించే వ్యక్తులు మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్లిపోతారు.. దీనికి కారణాలు ఇవే

ఎక్కువ సేపు నానబెట్టకండి

పట్టు చీరలను ఎక్కువ సేపు నీళ్లలో నానబెట్టవద్దు. 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే నానబెట్టండి. ఎక్కువసేపు నానబెట్టితే పట్టు నారలు బలహీనమవుతాయి, రంగులు పోతాయి.

  • చీరను తిప్పడం లేదా గట్టిగా పిండడం చేయకూడదు.
  • తిప్పడం వల్ల నారలు, ఎంబ్రాయిడరీ పాడవుతాయి. నీళ్లు తీసేటప్పుడు టవల్‌లో చుట్టి మెల్లగా నొక్కండి.
  • నీడలోనే ఆరబెట్టండి. నేరుగా ఎండలో పెడితే రంగులు డ్యామేజ్ అవుతాయి. నీడలో, గాలి వస్తున్న చోటు
  • ఆరబెట్టండి. ప్యాడెడ్ హ్యాంగర్‌లో వేలాడదీయండి లేదా చదునుగా పరచండి.
  • వాష్ చేసిన తర్వాత జాగ్రత్తగా చీరలను నిల్వ చేయాలి.
  • ముస్లిన్ లేదా కాటన్ గుడ్డలో చుట్టి భద్రపరచండి. ప్లాస్టిక్ కవర్లు వాడకండి. ఒకటి లేదా రెండు నెలలకొకసారి మడతలు మార్చండి.

ఈ సులభ పద్ధతులతో ఖరీదైన చీరలు చాలా కాలం కొత్తగా ఉంటాయి.

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×