E-Paper
Advertisement

Radish Benefits: చలికాలంలో ఒక్క ముల్లంగి తింటే వంద లాభాలు కలగడం ఖాయం

Radish Benefits: చలికాలంలో ఒక్క ముల్లంగి తింటే వంద లాభాలు కలగడం ఖాయం
Advertisement

ముల్లంగిని సాంబార్, కూర, పరాటాలు, సలాడ్లు ఇలా ఎన్నో వంటకాలలో దీనిని ఉపయోగిస్తారు. ఒక్క ముల్లంగిని తింటే చాలు మన శరీరానికి 100 ప్రయోజనాలు కలుగుతాయి. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ తెల్లని దుంపను ఆహారంలో చేరిస్తే శరీరానికి ఎన్నో రకాల లాభాలు చేరతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయలో ఉన్న ప్రత్యేక గుణాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మీరు ఊహించనంత అధికంగా ఉంటాయి.

ముల్లంగిలో ఫైబర్ పరిమాణం అధికంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటే అది జీర్ణవ్యవస్థను చక్కగా నడిపిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది ప్రత్యేకంగా మంచిది. రోజూ భోజనంతో పాటు కొంచెం ముల్లంగిని తీసుకుంటే జీర్ణక్రియ సమతుల్యంగా సాగుతుంది. పొట్ట నిండిన ఫీలింగ్ త్వరగా కలుగుతుంది.

Advertisement

కాలేయానికి రక్షణ
ముల్లంగి కాలేయం, పిత్తాశయాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఉండే సహజ ఎంజైములు లివర్‌ పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలో టాక్సిన్లను బయటికి పంపే విధానంలో ఇది సహజ సహకారి. ఫ్యాటి లివర్ సమస్యలను తగ్గించడంలో కూడా ముల్లంగి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముల్లంగిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పొటాషియం రక్తపోటును సమతుల్యంగా ఉంచే ఖనిజ పదార్థం. హై బీపీ ఉన్నవారు ఆహారంలో ముల్లంగిని చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది. ఇది రక్తనాళాలను సడలించి, రక్తప్రసరణను సాఫీగా నడిపిస్తుంది.

బరువు తగ్గుతారు
బరువు తగ్గాలనుకునేవారికి ముల్లంగి ఎంతో మంచిది.
ముల్లంగి తక్కువ కేలరీల ఆహారం. ఇందులో ఫ్యాట్ కూడా చాలా తక్కువ. కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. బరువు తగ్గాలనుకుంటున్నవారు సలాడ్ రూపంలో లేదా అల్పాహారంతో పాటు ముల్లంగిని తింటే మంచి ఫలితం ఉంటుంది. ముల్లంగిలో విటమిన్ C మంచి మోతాదులో ఉంటుంది. శరీరాన్ని రోగాల నుండి కాపాడే రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో సాధారణ జలుబు, ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో విటమిన్ C పాత్ర ఎంతో ముఖ్యమైనది.

Advertisement

డయాబెటిస్ తగ్గిస్తుంది
ముల్లంగిచర్మానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, తేలికగా ఉంచుతాయి. ముల్లంగి రసం తాగితే లేదా దానిని సలాడ్‌గా తింటే చర్మంలో సహజ కాంతి పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకూ ఇది సహాయకారిగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారి ఆహారంలో ముల్లంగిని చేర్చడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ముల్లంగి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది.

శ్వాస సంబంధిత సమస్య
ముల్లంగిలో ఉండే సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాసకోశానికి మేలు చేస్తాయి. జలుబు, దగ్గు, సైనస్ సమస్యల్లో ముల్లంగి రసం లేదా వేపుడు రూపంలో తీసుకోవడం ఉపశమనం ఇస్తుంది. ముల్లంగిని ఎలా తిన్నా శరీరానికి మేలు చేసే కూరగాయే.

చవకగా, సులభంగా దొరికే ముల్లంగి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. బరువు తగ్గడం నుండి లివర్ ఆరోగ్యం వరకు ఎనో లాభాలు. కాబట్టి దీనిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత సులభం అవుతుంది.

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×