Bigg Boss 9 Telugu : టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో సీజన్ 9 ప్రసారం అవుతుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ 9 వారాలు పూర్తిచేసుకుని పదో వారంలోకి అడుగు పెట్టింది. ఇవాల్టితో 10 వారాలు కూడా పూర్తవుతాయి. తొమ్మిదో వారం డబల్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే. నిజానికి రామ్ తనకు తానే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు.. హౌస్ నుంచి తొమ్మిదవ వారం సాయి శ్రీనివాస్ అతి తక్కువ ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యాడు. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న ఆసక్తి జనాల్లో కనిపిస్తుంది.. ఇదిలా ఉండగా గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సీజన్ 8 తో పోలిస్తే ఈ సీజను రేటింగు చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. టీఆర్పి రేటింగ్ తక్కువగా ఉండడంతో స్టార్ మా ఈ షో పై కీలక నిర్ణయం తీసుకుందని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీజన్ టిఆర్పి రేటింగ్ ఎంత ఉంది..? అతి త్వరలోనే సీజన్ కి శుభం కార్డు పడుంతుందేమో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాప్ రియాలిటీ షో అనగానే బిగ్ బాస్ పేరే గుర్తుకొస్తుంది. కేవలం రియాల్టీ షో మాత్రమే కాదు.. రిచెస్ట్ షో కూడా ఇదే.. హౌస్ లోకి కాంటెస్ట్ లను వేలకు వేలు పెట్టి రెమ్యూనరేషన్ ఇస్తూ తీసుకొస్తున్నారు. పాపులర్ అయిన స్టార్స్ గనక హౌస్ లో ఉంటే వాళ్లకు లక్షల్లో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి హౌస్ లోకి తీసుకొస్తున్నారు యాజమాన్యం. వంద రోజుల ప్రయాణం 16 మంది సెలబ్రిటీల మధ్య పోరు అంటూ సాగే ఈ షోలో హౌస్మెట్స్ మధ్య జరిగే టాస్కులు, మాటల యుద్ధాలు ఆ ఛానల్ టీఆర్పీ రేటింగ్ ని బాగా పెంచుతాయి. దాంతో పెట్టిన పెట్టుబడి కంటే మూడింతలు లాభాలు వస్తాయని గతంలో అందరూ అనుకున్నారు..ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోయిందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు చర్చ నడుస్తుంది. 5 వ వారం వరకు టీఆర్పీ రేటింగ్ 5.03 ఉండేది. ఈ రేటింగ్ తో బిగ్ బాస్ షోను కొనసాగిస్తే నష్టాలే మిగులుతాయని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 80 రోజులకు ముగిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. దీనిపై యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Also Read : గెటప్ శ్రీను, చంద్ర నిజ స్వరూపం ఇదే..జబర్దస్త్ లో నమ్మలేని నిజాలు..
పదోవారం నామినేషన్స్ ప్రక్రియ కాస్త ఆసక్తిగానే మారింది. హౌస్ లో ఉన్న వారిలో నిఖిల్, గౌరవ్ ఇద్దరూ కూడా తక్కువ ఓటింగ్ లో ఉన్నారు. గత రెండు మూడు వారాలుగా వీళ్ళిద్దరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు.. మరి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందా..? లేదా వీళ్ళిద్దరిలో నిఖిల్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోతాడా? ఇవాళ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి క్లాసులు పీకుతాడో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కూడా ఈ వీకెండ్ ఎపిసోడ్ మాత్రం బాగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. గత వారం రిరీలీజ్ కోసం అమల, రామ్ గోపాల్ వర్మ గెస్టులు గా వచ్చారు. మరి ఈ వారం ఏ మూవీ టీమ్ వస్తుందో చూడాలి..