E-Paper
Advertisement

Banana: 30 రోజుల పాటు తరచూ అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?

Banana: 30 రోజుల పాటు తరచూ అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

Banana: అరటి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా అరటిపండులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వీటిని చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఇష్టంగా తింటుంటారు. అయితే కొంత మంది అరటి పండును తరచూ తినడానికి ఇష్టపడుతుంటారు. ఈ తరుణంలో 30 రోజుల పాటు తరచూ అరటిపండును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

అరటి పండులో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే బీ6 రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. మరోవైపు అరటిపండులో ఉండే ఖనిజాలు శరీరంలో శక్తిని ఇవ్వడానికి తోడ్పడతాయి. అంతేకాదు అరటిపండును తినడం వల్ల చాలా రకాల జీర్ణక్రియ సమస్యలను తగ్గించుకోవచ్చు. మరోవైపు కడుపు సంబంధింత సమస్యలను కూడా నివారించుకోవచ్చు. అరటిపండులో ఉండే ప్రోబయోటిక్స్, ఫైబర్ వంటివి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

Advertisement

అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు అరటిపండును తరచూ తీసుకుంటే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఎసిడిటీ వల్ల ఏర్పడే ఛాతీలో మంటను కూడా అరటిపండు ద్వారా తగ్గించుకోవచ్చు. అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్న వారు కూడా అరటి పండును తింటే చాలా మంచి ఫలితం ఉంటుంది. దీనిని ఓ అలవాటుగా మార్చుకుంటే కేవలం 30 రోజుల్లో శరరీంలో ఉండే చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.

అరటిపండులో విటమిన్ బీ కూడా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు గుండె పని తీరును మెరుగుపరుస్తాయి. ఇక గుండె ఆరోగ్యానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండులో ఉండే విటమిన్ సి మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఒత్తిడి వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్న వారు అరటిపండును తీసుకోవడం వల్ల విటమిన్ బీ6 అందుతుంది.

Advertisement

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×