E-Paper
Advertisement

Jani Master Issue : జానీ మాస్టర్ ఇష్యూ.. అల్లు అర్జున్ స్పందనపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవిశంకర్

Jani Master Issue : జానీ మాస్టర్ ఇష్యూ.. అల్లు అర్జున్ స్పందనపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవిశంకర్
Advertisement

Jani Master Issue : గత కొన్ని రోజులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనాత్మకంగా మారిన వివాదం జానీ మాస్టర్ ఇష్యూ. ప్రముఖ పాన్ ఇండియా తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఒక లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన విషయం విధితమే. జానీ మాస్టర్ తనను మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగికంగా వేధించారు అంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ కారణంగానే జానీ మాస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి, చంచల్గూడా సెంట్రల్ జైలులో 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులో పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.

ఈ కేసు గురించి సరైన అవగాహన రాకముందే చాలా కీలకమైన అంశాలు చర్చలోకి వచ్చేసాయి. జానీ మాస్టర్ కేసు కు సంబంధించి ముఖ్యంగా దర్శకులు సుకుమార్, అల్లు అర్జున్ పేర్లు బయట వినిపించాయి. దీనికి కారణం సదరు బాధితురాలు పుష్పా 2 సినిమాకి పనిచేయడం. బాధితురాలికి అల్లు అర్జున్ సపోర్ట్ గా ఉంటారని, అలానే గీత ఆర్ట్స్ లో జరగబోయే సినిమాలన్నిటికీ కూడా ఈమెకు అవకాశం కల్పిస్తారని కొన్ని కథనాలు వినిపించాయి. అయితే దీని గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం రాలేదు. ఇక లేటెస్ట్ గా దీని గురించి ప్రొడ్యూసర్ రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

నిర్మాత రవిశంకర్ క్లారిటీ

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రజెంట్ చేసిన మత్తు వదలరా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వల్ గా మత్తు వదలరా 2 కూడా రిలీజ్ అయింది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను కొద్దిసేపటి క్రితం నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సక్సెస్ మీట్ లో ఒక ప్రముఖ జర్నలిస్ట్ జానీ మాస్టర్ కేసు విషయంలో అల్లు అర్జున్ గురించి ప్రశ్నించారు. దీనికి నిర్మాత రవిశంకర్ సమాధానం ఇస్తూ.. ‘‘ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ది పర్సనల్ వ్యవహారం, తను మా సినిమాకి ఎడిషనల్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. మా సినిమాకి గణేష్ ఆచార్య మెయిన్ కొరియోగ్రాఫర్. వీళ్ళు ఏమైనా కొత్త మూమెంట్స్ కంపోజ్ చేస్తారు అని వాళ్ళని పెట్టుకున్నాం’’ అని తెలిపారు.

Advertisement

‘‘ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన సాంగ్స్ లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. అది జానీ మాస్టర్ తో చేయిద్దాం అనుకున్నాం. కానీ ఈలోపే ఇలా జరిగింది. అసలు ఈ ఇష్యూ కి హీరో గారికి సంబంధమే లేదు. ఎక్కడో ఆర్టిస్టులు గుడ్ మార్నింగ్ చెప్తే వాళ్ళకి రియాక్ట్ అవుతారు తప్ప, ఇలాంటివి హీరో గారికి తెలియవు. ఇప్పుడు ఉంటున్న సీనియర్ మీడియా సంస్థలు కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ రేటింగ్స్ కోసం తప్పుడు వార్తలని ప్రచారం చేస్తూ, పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు’’ అంటూ  నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×