E-Paper
Advertisement

Sleeping With Wet Hair: వామ్మో.. తడి జుట్టుతో నిద్రపోతే ఇలా జరుగుతుందా ? ఇకనుంచైనా మానేయండి !

Sleeping With Wet Hair: వామ్మో.. తడి జుట్టుతో నిద్రపోతే ఇలా జరుగుతుందా ? ఇకనుంచైనా మానేయండి !
Advertisement

Sleeping With Wet Hair: తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల నేరుగా జలుబు వంటి అనారోగ్యాలు రానప్పటికీ.. ఇది జుట్టు, తల ఆరోగ్యానికి మాత్రం చాలా హానికరం. ఇంతకీ తడి జుట్టుతో పడుకోవడం వల్ల కలిగే సమస్యలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

జుట్టు దెబ్బతినడం:

జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా పెళుసుగా, బలహీనంగా ఉంటుంది. పడుకున్నప్పుడు దిండుకు, పరుపుకు మధ్య జరిగే రాపిడి వల్ల జుట్టుకు నష్టం జరుగుతుంది. అంతే కాకుండా రాలిపోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే తడి జుట్టుతో నిద్రపోకూడదని నిపుణులు చెబుతుంటారు.

Advertisement

జుట్టు చిట్లడం:

తడి జుట్టుకు బరువు కారణంగా సాగే గుణంతో ఉంటుంది. దిండుపై అటూ ఇటూ కదలడం వల్ల కలిగే ఘర్షణతో వెంట్రుకలు సులభంగా తెగిపోతాయి లేదా చిట్లిపోతాయి. అందకే పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి

చిక్కులు:

తడి జుట్టును సరిగ్గా ఆరబెట్టకుండా పడుకుంటే.. అది చిక్కులు పడిపోతుంది. ఉదయం వాటిని దువ్వడం కష్టమవుతుంది. అంతే కాకుండా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.

తలపై చర్మ సమస్యలు:

తలపై దిండు మధ్య ఉండే వెచ్చని, తేమతో కూడిన వాతావరణం బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్) వృద్ధి చెందడానికి అనువైన ప్రదేశం.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు:

మలస్సేజియా వంటి శిలీంధ్రాలు సాధారణంగా తల చర్మంపై నివసిస్తాయి. కానీ తేమతో కూడిన వాతావరణంలో అవి విపరీతంగా పెరుగుతాయి. ఇది చుండ్రు, దురదకు దారితీస్తుంది.

మొటిమలు, దద్దుర్లు :

తల చర్మం, ముఖంపై ఉండే తేమ కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు లేదా దద్దుర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ఇతర ప్రభావాలు:

సహజ నూనెలు కోల్పోవడం: దిండు ఫాబ్రిక్ జుట్టులోని సహజ నూనెలు, తేమను గ్రహిస్తుంది. దీని వల్ల తల చర్మం పొడిబారడం, జుట్టు నిర్జీవంగా మారడం జరుగుతుంది.

నిద్ర నాణ్యత: తడి జుట్టుతో పడుకోవడం అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇది నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది.

జుట్టు ఆరోగ్యంగా.. బలంగా ఉండాలంటే.. నిద్రపోయే ముందు జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవడం ఉత్తమం. సమయం లేకపోతే.. కనీసం టవల్‌తో వీలైనంత వరకు తేమను తీసేసి, సహజంగా ఆరనివ్వడానికి ప్రయత్నించండి.

Related News

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

Big Stories

Advertisement
×