E-Paper
Advertisement

Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే
Advertisement

Asia Cup Rising Stars 2025:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ( ACC Mens Asia Cup Rising Stars 2025) తుది దశకు వచ్చింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటికే నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లాయి. గ్రూప్ Aలో ఉన్న బంగ్లాదేశ్ A, శ్రీలంక A జట్లు సెమీ ఫైనల్ కు క్వాలిఫై అయ్యాయి. అటు గ్రూప్ బీలో ఉన్న టీమిండియా A అలాగే పాకిస్తాన్ A జట్లు కూడా విజయవంతంగా సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. దీంతో ఈ నాలుగు జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ లు రెండు జరగబోతున్నాయి. ఇందులో గెలిచిన జట్లు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ లో తలపడతాయి. నవంబర్ 23వ తేదీన దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

Also Read: IND VS SA 2nd Test: టీమిండియా జెర్సీపై ట్రోలింగ్..న‌ర్స్ పాప‌ల్లాగే ఉన్నారురా..మెడ‌ప‌ట్టితో గిల్ ద‌ర్శ‌నం

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి సెమీ ఫైనల్

Advertisement

టీమిండియా A వర్సెస్ బంగ్లాదేశ్ A జట్ల మధ్య శుక్ర‌వారం అంటే నవంబర్ 21వ తేదీన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగానే ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ పూర్తికాగానే రాత్రి 8 గంటలకు పాకిస్తాన్ A వర్సెస్ శ్రీలంక A జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది. టి20 ఫార్మాట్ లో జరగనున్న ఈ రెండో సెమీ ఫైనల్ కూడా దోహా స్టేడియం వేదికగానే జరగనుంది. ఈ రెండు సెమీ ఫైనల్స్ లో గెలిచిన జట్లు ఫైనల్ కు చేరుతాయి. ప్రాథమిక అంచనా ప్రకారం టీమ్ ఇండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు ఫైనల్ కు వెళ్తాయని అంటున్నారు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన సెమీ ఫైనల్ మ్యాచ్ ల‌ను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో తిలకించవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్ లో కూడా ఈ ప్రసారాలు రానున్నాయి.

Also Read: Shai Hope Record: స‌చిన్, కోహ్లీ వ‌ల్లే కాలేదు, సెంచ‌రీల‌లో షాయ్ హోప్ కొత్త రికార్డ్‌.. నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

Advertisement

టీమిండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్ జ‌ట్ల అంచ‌నా

భారతదేశం A: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేరా, నమన్ ధీర్ (vc), జితేష్ శర్మ (c) (wk), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, సుయాష్ శర్మ,, గుర్జప్నీత్ సింగ్, విజయ్ కుమార్ వైషక్.

బంగ్లాదేశ్ A: అక్బర్ అలీ (c), Md. హబీబుర్ రెహమాన్, యాసిర్ అలీ, జిషాన్ ఆలం, అరిఫుల్ ఇస్లాం, రకీబుల్ హసన్, మహిదుల్ అంకోన్ (wk), తోఫెల్ అహ్మద్ రేహాన్, మృత్తుంజోయ్ చౌదరి, మెహెరోబ్ హసన్, రిపాన్ మొండోల్.

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×