E-Paper
Advertisement

ఫైబర్ లోపం లక్షణాలు.. మీ శరీరం ఇచ్చే హెచ్చరికలను గమనించండి!

ఫైబర్ లోపం లక్షణాలు.. మీ శరీరం ఇచ్చే హెచ్చరికలను గమనించండి!
Advertisement

Fiber Deficiency: మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు తప్పకుండా ఉండాలని చూస్తాం కానీ. చాలా మంది ‘ఫైబర్’గురించి పెద్దగా పట్టించుకోరు. నిజానికి మన జీర్ణ వ్యవస్థను క్లీన్ చేసే చీపురు లాంటిది ఈ ఫైబర్. ఇది సరిగ్గా లేకపోతే పొట్ట ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు చుట్టుముడతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉండాలన్నా.. బరువు తగ్గాలన్నా పీచుపదార్థం చాలా ముఖ్యం. మరి మీ ఆహారంలో ఫైబర్ తక్కువైందని ఎలా గుర్తించాలి ? దాన్ని ఎలా భర్తీ చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పీచుపదార్థం అంటే ఏంటి?
పీచుపదార్థం అనేది మొక్కల నుంచి లభించే ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది ఇతర ఆహార పదార్థాల లాగా శరీరంలో పూర్తిగా జీర్ణం కాదు. ఇది రెండు రకాలు..

Advertisement

కరగని పీచు: ఇది మలాన్ని మెత్తబరిచి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

కరిగే పీచు: ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయ పడుతుంది.

Advertisement

మీ ఆహారంలో ఫైబర్ లోపించిందని చెప్పే 5 సంకేతాలు:

1. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం:
ఫైబర్ లోపానికి అత్యంత సాధారణ లక్షణం మలబద్ధకం. పీచు పదార్థం తక్కువైతే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల పొట్ట భారంగా అనిపించడం, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.

2. తిన్న వెంటనే ఆకలి వేయడం:
ఫైబర్ ఉన్న ఆహారం తింటే కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ మీరు భోజనం చేసిన గంటకే మళ్ళీ ఆకలిగా అనిపిస్తుంటే.. మీ ఆహారంలో తగినంత పీచు లేదని అర్థం. ఇది చివరకు అతిగా తినడానికి దారి తీస్తుంది.

3. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం:
డయాబెటిస్ ఉన్నవారికి ఫైబర్ ఒక వరం.ఇది చక్కెరను రక్తం త్వరగా పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. పీచు తక్కువైతే తిన్న వెంటనే షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగిపోతాయి.

4. కొలెస్ట్రాల్ పెరగడం:
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో పీచు పదార్థం కీలకం. ఇది లోపిస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

5. అలసట:
పీచుపదార్థం తక్కువగా ఉంటే శరీరానికి శక్తి నెమ్మదిగా విడుదల కాదు. దీని వల్ల రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు లోనై, మధ్యాహ్నం వేళ విపరీతమైన నీరసం వచ్చే అవకాశం ఉంది.

ఫైబర్ పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం:
మిల్లెట్స్: ముడి బియ్యం, ఓట్స్, జొన్నలు, సజ్జలు.

పండ్లు: తొక్క తీయకుండా తినే ఆపిల్స్, జామపండ్లు, నారింజ.

కూరగాయలు: బ్రోకలీ, బీన్స్, క్యారెట్లు, ఆకుకూరలు.

పప్పు ధాన్యాలు: శనగలు, పెసలు, రాజ్మా వంటివి.

కేవలం ఫైబర్ తీసుకోవడమే కాకుండా.. దాంతో పాటు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు లేకుండా పీచు పదార్థం తీసుకుంటే.. అది పేగుల్లో గట్టిపడి మరిన్ని జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. రోజుకు కనీసం 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×